News August 14, 2025
‘సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని సహించం’

సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడుతామని AITUC అధ్యక్ష, కార్యదర్శులు V.సీతారామయ్య, K.రాజ్‌కుమార్ అన్నారు. బుధవారం గోదావరిఖనిలో AITUC సెంట్రల్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని సహించేది లేదన్నారు. సింగరేణికి రావాల్సిన బకాయిల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా విమర్శలు చేయడం INTUC విధానమా అని ప్రశ్నించారు.
Similar News
News April 18, 2026
VJA: ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య (UPDATE)

విజయవాడ శివారు పైడూరుపాడులో శుక్రవారం రాత్రి కవిత అనే మహిళ తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్న <<19678151>>విషయం తెలిసిందే. <<>>సమాచారం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల వివరాలు సేకరిస్తున్నారు. కాగా కవిత గత 5 సంవత్సరాలుగా వింతగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
News April 18, 2026
బాపట్ల జిల్లాలో నలుగురు ఎస్ఐల బదిలీలు

బాపట్ల జిల్లాలో నలుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ ఉమా మహేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజాంపట్నం ఎస్ఐగా పని చేస్తున్న తిరుపతిరావును చెరుకుపల్లికి, జిల్లా వీఆర్‌లో ఉన్న కిరణ్ బాబును నిజాంపట్నానికి, బాపట్ల పీసీఆర్ ఎస్సైగా పనిచేస్తున్న బాబురావును మార్టూరు పోలీస్ స్టేషన్‌కు, చెరుకుపల్లి ఎస్సై అనిల్ కుమార్‌ను జిల్లా వీఆర్‌కు బదిలీ చేశారు.
News April 18, 2026
చిత్తూరు: ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

చిత్తూరు జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం 6 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గంగవరంలో 41.2, రొంపిచెర్లలో 41.1, శ్రీరంగరాజపురంలో 40.1, తవణంపల్లెలో 40.9, విజయపురంలో 40.5, బంగారుపాళ్యంలో 40.0, నగరి, నిండ్రలో 39.8, పులిచెర్ల, శాంతిపురంలో 39.6 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది.


