News August 14, 2025

తాండూరులో రైలు కింద పడి వ్యక్తి మృతి

image

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన తాండూరులో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. బుధవారం మధ్యాహ్నం రైల్వే స్టేషన్ యార్డులో ఓ వ్యక్తి (55) గుర్తుతెలియని రైలు కిందపడి చనిపోయాడు. మృతుడి చొక్కాపై శ్రీను టైలర్స్ శంకర్‌పల్లి అని రాసి ఉంది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే 7702629707 నంబర్‌కు కాల్ చేసి, సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News August 16, 2025

ఖమ్మం జిల్లాలో 579.9 MM వర్షపాతం నమోదు

image

ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో మొత్తం 579.9 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. కొనిజర్లలో అత్యధికంగా 70.9 మి.మీ, ఎర్రుపాలెం మండలంలో అసలు వర్షపాతం నమోదు కాలేదని సింగరేణి 61.4 మి.మీ, వైరా 55.4 మి.మీ, కుసుమాంచి 47.8 మి.మీ, కామేపల్లి 46.7 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News August 16, 2025

ధర్మవరంలో ఉగ్ర కలకలం

image

AP: శ్రీసత్యసాయి(D) ధర్మవరంలో ఉగ్ర కలకలం రేగింది. కోట ఏరియాలో నూర్ మహమ్మద్ అనే వ్యక్తి ఇంట్లో IB, NIA, స్థానిక పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పాకిస్థాన్‌కు అతను ఫోన్ కాల్స్ చేస్తూ అక్కడి తీవ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. టీస్టాల్‌లో పనిచేస్తున్న నూర్ ఇంట్లో అనుమానిత వస్తువులు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులతో సంబంధాలపై NIA ఆరా తీస్తోంది.

News August 16, 2025

రూ.100 కోట్లు దాటిన ‘వార్-2’ కలెక్షన్లు

image

ఎన్టీఆర్, హృతిక్ నటించిన ‘వార్-2’ మూవీ రెండో రోజు మంచి కలెక్షన్లు రాబట్టింది. ‘Sacnilk’ ప్రకారం తొలిరోజు కంటే ఎక్కువ వసూళ్లు రావడం గమనార్హం. నిన్న మూవీకి రూ.56.35 కోట్లు రాగా తొలిరోజు రూ.52 కోట్లు వచ్చాయి. దీంతో మొత్తంగా ఈ మూవీ రూ.108.35 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. వీకెండ్ కావడంతో ఇవాళ, రేపు కూడా కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి.