News August 14, 2025

ఎమ్మెల్యే బండారుకు నారా లోకేశ్ ఫోన్

image

ఆలమూరులో జరిగిన రైతు సంబరం కార్యక్రమంలో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావును మంత్రి నారా లోకేశ్ ఫోన్‌లో పరామర్శించారు. బుధవారం సత్యానందరావుకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనలో గాయపడిన జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు సతీశ్ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలుసుకున్నారు.

Similar News

News April 18, 2026

ఇరాన్ రాయబారికి భారత్ సమన్లు

image

హార్ముజ్‌‌ను దాటేందుకు ప్రయత్నించిన రెండు ఇండియన్ నౌకలపై IRGC కాల్పులు <<19684352>>జరపడాన్ని<<>> భారత్ సీరియస్‌గా తీసుకుంది. ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి సమన్లు ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నాయి. కాగా దాడులకు గురైన నౌకలోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.

News April 18, 2026

MGU బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో బీటెక్ పరీక్షల షెడ్యూల్ ను యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. సెమిస్టర్-2,4 (రెగ్యులర్ & బ్యాక్ లాగ్), సెమిస్టర్-1,3 (బ్యాక్ లాగ్) పరీక్షలు మే-5 నుంచి మే-21 మధ్య జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. టైం టేబుల్స్‌ను అధికారక ఎంజీయూ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.

News April 18, 2026

మెదక్: ఎల్లుండి నుంచి సంక్షేమ వారోత్సవాలు..!

image

TGలో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 20 నుంచి 26 వరకు సంక్షేమ వారోత్సవాలు నిర్వహించాలని GOVT నిర్ణయించింది. ఈ మేరకు CS కె.రామకృష్ణారావు శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక ఆదేశాలు జారీ చేశారు. APR 20న శుభ్రత, 21న టాలెంట్ ఫెస్ట్, 22న మౌలిక సదుపాయాలు, 23న పేరెంట్స్ మీటింగ్, 24న నైపుణ్యాభివృద్ధి, 25న సమ్మర్ క్యాంపులు, 26న బడి బాట ఉంటుందన్నారు.