News August 14, 2025

సిరిసిల్ల: ’పర్ష రాములకు రాజనర్సు స్మారక సాహితీ పురస్కారం’

image

బాల సాహిత్యంలో వాసర వేణి పర్ష రాములకు సిలుముల రాజనర్సు 2025 స్మాల్క్ సాహితీ పురస్కారం వరించింది. ఈ పురస్కారాన్ని సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో MLA కేటీఆర్ చేతుల మీదుగా పర్ష రాములు అందుకున్నారు. ఈ సందర్భంగా పురస్కార కమిటీ అధ్యక్షుడు జయవర్ధన్ మాట్లాడుతూ.. పర్షరాములు బాల్యం నుండే వ్యవసాయ కూలీగా, సిరిసిల్లలో చేనేత కార్మికునిగా కూడా పని చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సైతం తన వంతు కృషి చేశారన్నారు.

Similar News

News August 16, 2025

FLASH: క్రమంగా తగ్గుతున్న బంగారం ధరలు

image

బంగారం దిగుమతులపై ఎలాంటి టారిఫ్‌లు విధించమని ట్రంప్ ప్రకటించడంతో గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.60 తగ్గి రూ.1,01,180కు చేరింది. 8 రోజుల్లో మొత్తం ₹2,130 తగ్గింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.50 పతనమై రూ.92,750 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,26,200గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 16, 2025

కామారెడ్డి జిల్లాలో 3,705 ఫోన్‌ల రికవరీ

image

సీఈఐఆర్ పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో ఇప్పటివరకు 3,705 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఫోన్ పోయినా లేదా దొంగతనానికి గురైనా ఆందోళన చెందకుండా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా తిరిగి పొందవచ్చన్నారు. మొబైల్ పోయిన వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

News August 16, 2025

యల్లనూరు యువకుడిపై పోక్సో కేసు

image

యల్లనూరు (మం) జంగంపల్లికి చెందిన నాగ మల్లేశ్ పై పోక్సో కేసు నమోదైంది. తాడిపత్రికి చెందిన బాలికను నమ్మించి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టి బాలికను కుటుంబీకులకు అప్పగించి, యువకుడిపై కేసు నమోదు చేశామన్నారు.