News August 14, 2025
పెద్దపల్లి: ‘విద్యార్థులకు అవగాహన కల్పించాలి’

జిల్లాలో ఉన్న ప్రాంతీయ టాస్క్ సెంటర్ ద్వారా అందించే కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో యువతకు ఉపాధి కల్పనపై డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ లతో సమీక్ష నిర్వహించారు. డిగ్రీ, ఇంజనీరింగ్ ముగిసిన విద్యార్దులు టాస్క్ కోర్సులలో నమోదు చేసుకోవాలన్నారు. టామ్ కామ్ ద్వారా విదేశాలలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చు కోవాలని సూచించారు.
Similar News
News August 16, 2025
ఖమ్మం జిల్లాలో 579.9 MM వర్షపాతం నమోదు

ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో మొత్తం 579.9 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. కొనిజర్లలో అత్యధికంగా 70.9 మి.మీ, ఎర్రుపాలెం మండలంలో అసలు వర్షపాతం నమోదు కాలేదని సింగరేణి 61.4 మి.మీ, వైరా 55.4 మి.మీ, కుసుమాంచి 47.8 మి.మీ, కామేపల్లి 46.7 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News August 16, 2025
ధర్మవరంలో ఉగ్ర కలకలం

AP: శ్రీసత్యసాయి(D) ధర్మవరంలో ఉగ్ర కలకలం రేగింది. కోట ఏరియాలో నూర్ మహమ్మద్ అనే వ్యక్తి ఇంట్లో IB, NIA, స్థానిక పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పాకిస్థాన్‌కు అతను ఫోన్ కాల్స్ చేస్తూ అక్కడి తీవ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. టీస్టాల్‌లో పనిచేస్తున్న నూర్ ఇంట్లో అనుమానిత వస్తువులు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులతో సంబంధాలపై NIA ఆరా తీస్తోంది.
News August 16, 2025
రూ.100 కోట్లు దాటిన ‘వార్-2’ కలెక్షన్లు

ఎన్టీఆర్, హృతిక్ నటించిన ‘వార్-2’ మూవీ రెండో రోజు మంచి కలెక్షన్లు రాబట్టింది. ‘Sacnilk’ ప్రకారం తొలిరోజు కంటే ఎక్కువ వసూళ్లు రావడం గమనార్హం. నిన్న మూవీకి రూ.56.35 కోట్లు రాగా తొలిరోజు రూ.52 కోట్లు వచ్చాయి. దీంతో మొత్తంగా ఈ మూవీ రూ.108.35 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. వీకెండ్ కావడంతో ఇవాళ, రేపు కూడా కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి.