News August 14, 2025
బాసర ఆర్జీయూకేటీలో మాదకద్రవ్యాలపై అవగాహన

బాసరలోని ఆర్జీయూకేటీలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఎస్‌ఐ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అనంతరం మాదకద్రవ్యాలను వాడబోమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని పేర్కొన్నారు.
Similar News
News August 14, 2025
అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ఏలూరు గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో కలెక్టర్ కె.వెట్రిసెల్వి పాల్గొన్నారు. స్కూలింగ్ బిల్డింగ్ బ్లాక్స్ అనే అంశంపై జిల్లాలోని విద్యాశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా అన్ని రంగాల్లోనూ కృషి చేయాలని ఆమె సూచించారు.
News August 14, 2025
ఉమామహేశ్వరంలో దైవ దర్శనం 3 రోజులు బంద్

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమామహేశ్వర దేవస్థానం కొండపై నుంచి రోడ్డుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులు దర్శనం బంద్ చేసినట్లు ఎస్సై విజయ భాస్కర్ తెలిపారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగరాజుతో కలిసి ఉమామహేశ్వర పరిసరాలను పరిశీలించారు. భక్తులు దైవ దర్శనానికి రావద్దని, అంతరాయానికి సహకరించాలని కోరారు.
News August 14, 2025
హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాల్లో ఉప ఎన్నికకు రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన న్యాయస్థానం కొట్టివేసింది. కాగా పులివెందుల పరిధిలో 15 పోలింగ్ కేంద్రాల్లో, ఒంటిమిట్ట పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వైసీపీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.