News August 14, 2025
భూధార్ నంబర్ల కేటాయింపుపై అధికారులకు CM ఆదేశాలు

TG: భూములకు భూధార్ నంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన వారసత్వ, ఇతర మ్యుటేషన్ల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సమీక్ష సమావేశంలో సూచించారు. కోర్ అర్బన్ ఏరియాలో కొత్తగా నిర్మించనున్న 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పార్కింగ్, క్యాంటీన్, ఇతర మౌలిక వసతులు ఉండేలా చూడాలన్నారు.
Similar News
News August 16, 2025
కేసీఆర్ వద్దకు కవిత.. నిన్న ఏం జరిగిందంటే?

TG: తన చిన్న కుమారుడు ఆర్య చదువు కోసం US వెళ్తున్న తరుణంలో కవిత నిన్న KCRను కలిసేందుకు ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు వెళ్లారు. అయితే కేసీఆర్-కవిత మాట్లాడుకోలేదని విశ్వసనీయ సమాచారం. ఇంటి ప్రధాన ద్వారం వద్దే ఆమె ఉండిపోగా.. KCR ఆర్యను తన గదికి పిలిపించుకొని 10నిమిషాల పాటు మాట్లాడి, ఆశీర్వదించి పంపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఫాంహౌస్‌కు చేరుకున్న KTR, హరీశ్ రావు, ఇతర నేతలూ కవితతో మాట్లాడలేదని సమాచారం.
News August 16, 2025
దారుణం.. ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం, హత్య

హైదరాబాద్ ఉప్పల్ రామంతాపూర్‌లో దారుణం జరిగింది. అభం శుభం తెలియని బాలుడి(5)పై ఓ కామాంధుడు లైంగిక దాడి చేసి, అనంతరం హత్య చేశాడు. రామంతాపూర్‌కు చెందిన బాలుడు ఈ నెల 12న కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. CC ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు అనుమానితుడ్ని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. బాలుడికి మాయమాటలు చెప్పి ముళ్ల పొదల్లో అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపినట్లు అంగీకరించాడు.
News August 16, 2025
FLASH: క్రమంగా తగ్గుతున్న బంగారం ధరలు

బంగారం దిగుమతులపై ఎలాంటి టారిఫ్‌లు విధించమని ట్రంప్ ప్రకటించడంతో గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.60 తగ్గి రూ.1,01,180కు చేరింది. 8 రోజుల్లో మొత్తం ₹2,130 తగ్గింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.50 పతనమై రూ.92,750 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,26,200గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.