News August 14, 2025
హోంమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో బాపట్ల కలెక్టర్..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోంశాఖ మంత్రి వి.అనిత బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాపట్ల జిల్లా నుంచి కలెక్టర్ వెంకట మురళీ హాజరయ్యారు. జిల్లాలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, కొల్లూరు మండలంలో SDRF సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
Similar News
News August 14, 2025
HYD: వరద ముంపు ప్రాంతాల్లో హై అలర్ట్.!

గ్రేటర్ HYD వ్యాప్తంగా మొత్తం 149 వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు, ఒక్కసారిగా వర్షం కురిసిన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం కోసం పకడ్బందీగా చర్యలు చేపట్టినట్లు హైడ్రా, జీహెచ్ఎంసీ బృందాలు తెలిపారు. అర్ధరాత్రి సమయంలోనూ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

2,3 రోజుల పాటు భారీ వర్షాలు: మంత్రి

భారీ వర్షాలు, సహాయక చర్యలపై కలెక్టర్లు, SPలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ VCలో జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. మరో 2,3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని, జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.