News August 14, 2025
TODAY HEADLINES

★ AP, TGలో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
★ వర్షాలపై సీఎంల సమీక్ష.. అప్రమత్తంగా ఉండాలని సూచన
★ MLCలు కోదండరాం, అలీఖాన్‌ల నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు
★ చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు కావొచ్చు: జగన్
★ AP: జిల్లాల సరిహద్దులపై SEP 2 వరకు ప్రజాభిప్రాయ సేకరణ
★ ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు IOA ఆమోదం
★ కొత్త కస్టమర్లకు ICICI గుడ్‌న్యూస్
Similar News
News August 14, 2025
వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూటమిదే విజయం: మంత్రి

AP: వచ్చే ఎన్నికల్లో(అసెంబ్లీ, పార్లమెంటు) పులివెందులలో కూటమిదే విజయమని మంత్రి పార్థసారధి ధీమా వ్యక్తం చేశారు. ‘పులివెందుల ZPTC ఎన్నికల్లో TDP విజయం 2029 ఎన్నికల్లో కూటమి విజయానికి తొలి మెట్టు. YCPకి ఇది బలమైన నియోజకవర్గం. ఓటింగ్‌ను బహిష్కరించాలని ఆ పార్టీ చెప్పినా 55-65% పోలింగ్ నమోదైంది. ప్రజల్లో YCPపై ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనం. పోలీసులను జగన్ కించపరచడం సరైంది కాదు’ అని వ్యాఖ్యానించారు.
News August 14, 2025
క్లౌడ్ బరస్ట్.. 22 మంది మృతిపై PM మోదీ దిగ్భ్రాంతి

J&Kలోని కిష్త్వార్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ వల్ల 22మంది మృతిచెందడంపై PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నట్లు వివరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. బాధితులకు అవసరమైన ఏ సాయాన్ని అందించడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు అమిత్ షా సైతం J&K CM ఒమర్ అబ్దుల్లాకు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
News August 14, 2025
వివేకాకు న్యాయం చేయాలని స్లిప్: కౌంటింగ్ వేళ వెలుగుచూసిందన్న TDP

AP: పులివెందులలో జడ్పీటీసీ ఉపఎన్నిక కౌంటింగ్ సందర్భంగా ‘మా వివేకా సార్‌కి న్యాయం చేయండి సార్’ అని స్లిప్ వచ్చిందని టీడీపీ ట్వీట్ చేసింది. బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టే సమయంలో అజ్ఞాత వ్యక్తి వేసిన ఈ కాగితం బయటపడినట్లు పేర్కొంది. ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని, త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు వివరించింది. పులివెందుల ZPTC ఉప ఎన్నికలో TDP అభ్యర్థి లతారెడ్డి గెలిచిన విషయం తెలిసిందే.