News August 14, 2025

అన్నమయ్య: PGRSలో ఫిర్యాదు.. ఊరికి వచ్చిన కలెక్టర్

image

గాలివీడు మండలం నూలివీడులోని భూ సమస్యను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి స్వయంగా వెళ్లారు. PGRS ద్వారా ఒక బాధితుడు ఇచ్చిన అర్జీపై స్పందించి బుధవారం మధ్యాహ్నం ఆ గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబంతో మాట్లాడి, సమస్యను పరిష్కరించాలని తహశీల్దార్‌కు ఆదేశించారు. భూ సమస్యలను పరిష్కరించడానికి తహశీల్దార్లు గ్రామాలకు స్వయంగా వెళ్లి ప్రజలతో మాట్లాడాలని సూచించారు.

Similar News

News August 14, 2025

HYD: వరద ముంపు ప్రాంతాల్లో హై అలర్ట్.!

image

గ్రేటర్ HYD వ్యాప్తంగా మొత్తం 149 వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు, ఒక్కసారిగా వర్షం కురిసిన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం కోసం పకడ్బందీగా చర్యలు చేపట్టినట్లు హైడ్రా, జీహెచ్ఎంసీ బృందాలు తెలిపారు. అర్ధరాత్రి సమయంలోనూ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

2,3 రోజుల పాటు భారీ వ‌ర్షాలు: మంత్రి

image

భారీ వ‌ర్షాలు, స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై క‌లెక్ట‌ర్లు, SPలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫ‌రెన్స్‌ నిర్వహించారు. ఈ VCలో జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. మ‌రో 2,3 రోజుల పాటు భారీ వ‌ర్షాలు ఉంటాయ‌ని, జిల్లా అధికారులు అప్ర‌మత్తంగా ఉండి ఏవిధమైన ప్రాణ, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు.