News August 14, 2025

కేయూ దూర విద్యలో నూతన కోర్సులు

image

కాకతీయ యూనివర్సిటీ దూర విద్యా విధానంలో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా డిప్లమా కోర్సులతో పాటు, సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు స్టాండింగ్ కౌన్సిల్ దూర విద్యా విధానంలో పలు నూతన కోర్సుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ ఏడాది నుంచి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లాంగ్వేజ్, హ్యూమన్ వాల్యూస్ తదితర మరిన్ని నూతన కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి.

Similar News

News April 16, 2026

రిలేషన్‌షిప్, మ్యారేజ్‌కు నా దగ్గర టైమ్ లేదు: మృణాల్

image

రిలేషన్‌షిప్, మ్యారేజ్‌కు ప్రస్తుతం తన వద్ద టైమ్ లేదని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలిపారు. తాను సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పారు. ‘ఈమధ్య నా కాలుకు దెబ్బ తగిలింది. బిజీ షెడ్యూల్ వల్ల ట్రీట్‌మెంట్ చేయించుకోలేకపోయాను. అలాంటిది రిలేషన్‌షిప్‌కు నా దగ్గర టైమ్ ఎక్కడ ఉంటుంది. ఎవరితో డేటింగ్ చేస్తున్నానన్న దానికంటే నేను చేసే పని వల్లే నాకు గుర్తింపు రావాలి’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

News April 16, 2026

తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌తో పోలుస్తావా?.. హరీశ్‌రావు ఫైర్

image

పార్లమెంట్‌లో TG ఏర్పాటుపై BJP MP తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌తో పోలుస్తావా?, దశాబ్దాల పోరాటం, ఎంతో మంది త్యాగాల ఫలితమైన అలాంటి మహోద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమే.. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన తేజస్వీ క్షమాపణలు చెప్పాలి’ అని ట్వీట్ చేశారు.

News April 16, 2026

ఖమ్మం: 19న ‘గురుకుల’ ప్రవేశ పరీక్ష

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని గిరిజన సంక్షేమ ప్రతిభ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాల కోసం ఈనెల 19న నిర్వహించే పరీక్షకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని ITDA PO రాహుల్ సూచించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ https://tgtwrescoe.aptonline.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. నిర్ణీత సమయంలోగా హాల్ టికెట్లు పొంది, విద్యార్థులు పరీక్షకు సన్నద్ధం కావాలన్నారు.