News August 14, 2025
మత్తుకు బానిసలు కావొద్దు: ఎస్పీ జానకి

విద్యార్థులు చెడు వ్యసనాలు, మత్తుకు అడిక్ట్ కావొద్దని MBNR ఎస్పీ డి.జానకి సూచించారు. ధర్మాపూర్‌లోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. చదువుకునే క్రమంలో విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. చెడు స్నేహాలు, వ్యసనాలతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. సీఐ శ్రీనివాస్, ఏఎస్ఐ జయరాణి పాల్గొన్నారు.
Similar News
News August 15, 2025
MBNR: పోలీసు పరేడ్ మైదానంలో.. స్వాతంత్ర్య వేడుకలు

MBNRలోని పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలను తిలకించారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.
News August 15, 2025
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు.
News August 15, 2025
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ రోజు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతం ఆలపనలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.