News August 14, 2025
ADB: డిగ్రీ, PG అడ్మిషన్ల గడువు పొడిగింపు

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు ADB ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత, యూనివర్సిటీ కోఆర్డినేటర్ జగ్రామ్ తెలిపారు. అడ్మిషన్ల కోసం ఈ నెల 13 వరకున్న గడువును 20 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా విద్యార్థులు గమనించి, ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.
Similar News
News April 17, 2026
అనుమతి లేకుండా అల్లు అర్జున్ పేరు, ఫొటో వాడొద్దు: ఢిల్లీ హైకోర్టు

అల్లు అర్జున్ వ్యక్తిత్వ హక్కులను (Personality Rights) పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు <<19671551>>ఉత్తర్వులు<<>> జారీ చేసింది. ఆయన అనుమతి లేకుండా పేరు, వాయిస్, ఫొటోలు, సంతకాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని స్పష్టం చేసింది. డీప్‌ఫేక్, AI టెక్నాలజీతో తన వాయిస్‌ని క్లోనింగ్ చేయడం, ఫొటోలను మార్ఫింగ్ చేయడం వంటివి తన బ్రాండ్ విలువను, ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఆయన కోర్టును ఆశ్రయించగా ఇలా స్పందించింది.
News April 17, 2026
తొర్రూర్: వడదెబ్బతో రైతు మృతి

తొర్రూరు(M) గుర్తూరులో రైతు సింగారం శ్రీనివాస్ (62) వడదెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. పొలం పనుల్లో ఉండగా ఎండ తీవ్రతకు ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం HYDలోని ఓ ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఎండలు ముదురుతున్న తరుణంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News April 17, 2026
ఉమ్మడి పాలమూరులో 7 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలతో పాటు అదనంగా 7 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. నారాయణపేట, వనపర్తి జిల్లాలో కోస్గి, మద్దూర్, మరికల్, అమరచింత, కొత్తకోట, పెబ్బేరు నియోజకవర్గాలుగా ఏర్పడవచ్చు అని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల అఖిలపక్ష నాయకులు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని సభలు పెట్టారు. ఎన్ని ఏర్పడతాయో చూడాలి.


