News August 14, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 14, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.43 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.59 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.48 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.42 గంటలకు
✒ ఇష: రాత్రి 7.58 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News April 18, 2026
గజ్వేల్: భూసార పరీక్షా కేంద్రం అందుబాటులోకి వచ్చేనా..?

గజ్వేల్ పట్టణంలో భూసార పరీక్షా కేంద్రాన్ని 2023 అక్టోబరులో గత ప్రభుత్వంలో హరీశ్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే దీనికి ఇప్పటికీ సిబ్బంది నియామకం, ల్యాబ్ పరికరాలు లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, తమ భూములను పరీక్షించుకునే వెసులుబాటు కల్పించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
News April 18, 2026
చర్చకు సిద్ధమా? పవన్‌కు ప్రకాశ్‌రాజ్ సవాల్

మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు కావాలనే అడ్డుకున్నాయని AP D.CM <<19679100>>పవన్<<>> చేసిన ట్వీట్‌పై ప్రకాశ్‌రాజ్ స్పందించారు. ‘మోదీని మెప్పించేందుకు ప్రజలకు అబద్ధాలు చెప్పడం ఆపండి. ఈ బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. దాన్ని ఇప్పుడూ ఆమోదించవచ్చు. కానీ మీ ముఠా డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయాలని చూసింది. ఇది దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుంది. దీనిపై డిబేట్‌కు సిద్ధమా’ అని సవాల్ విసిరారు.
News April 18, 2026
B12 లోపంతో నరాలు దెబ్బతినే ప్రమాదం: వైద్యులు

రక్తహీనత లేకపోయినా 40% మందిలో విటమిన్ B12 లోపం వల్ల నరాల వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెట్‌ఫార్మిన్ మందు వాడే 15–30% మధుమేహ బాధితుల్లో ఈ లోపం కనిపిస్తోందని చెబుతున్నారు. ‘B12 స్థాయి 200 pg/mL కంటే తగ్గితే నరాలు శాశ్వతంగా దెబ్బతినే ముప్పు ఉంది. కాబట్టి సకాలంలో B12, MMA, హోమోసిస్టీన్ పరీక్షలు చేయించుకోవాలి. ఆలస్యమైతే నష్టం పూడ్చలేం’ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


