News August 14, 2025

ఆగస్టు 14: చరిత్రలో ఈ రోజు

image

1947: విభజన గాయాల సంస్మరణ దినం
1947: పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం
1957: కమెడియన్ జానీ లీవర్ జననం
1968: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే జననం
2011: బాలీవుడ్ నటుడు షమ్మీ కపూర్ మరణం
2012: మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావు దేశ్‌ముఖ్ మరణం
1983: సింగర్ సునిధి చౌహాన్ జననం

Similar News

News August 14, 2025

నేడు బలరామ జయంతి.. ఎలా పూజించాలంటే?

image

శ్రావణ బహుళ షష్ఠి(నేడు) రోజున బలరామ జయంతిని జరుపుకుంటారు. ఉ.8గం.-ఉ.11గం. వరకు పూజకు మంచిదని పండితులు తెలిపారు. ఈరోజు బలరాముని పూజిస్తే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం. ‘సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి బలరామకృష్ణుల పటాలకు గంధం, కుంకుమ పెట్టుకోవాలి. పారిజాత పూలు, శంఖు, పొగడ పూలతో పూజించాలి. పాలు, వెన్న, మీగడ, అటుకులు వంటి పదార్థాలతో నైవేద్యం సమర్పించాలి. ఉపవాసం ఉండాలి’ అని చెబుతున్నారు.

News August 14, 2025

మినిమం బ్యాలెన్స్‌‌ను భారీగా పెంచిన HDFC

image

అర్బన్ ఏరియాల్లో నెలవారీ మినిమం బ్యాలెన్స్‌ను రూ.25వేలకు పెంచుతున్నట్లు HDFC ప్రకటించింది. గతంలో ఇది రూ.10వేలుగా ఉండేది. AUG 1 తర్వాత సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి ఇది వర్తిస్తుంది. సెమీ అర్బన్ ఏరియాల్లోనూ రూ.25వేలుగా(గతంలో రూ.5వేలు) నిర్ధారించింది. రూరల్ ప్రాంతాల్లో రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచింది. ఇటీవల ICICI కూడా భారీగా మినిమం బ్యాలెన్స్‌ను పెంచగా తీవ్ర విమర్శలు రావడంతో <<17396156>>వెనక్కి<<>> తగ్గింది.

News August 14, 2025

జిల్లాల్లో ఎంత వర్షపాతం నమోదు అయ్యిందంటే?

image

AP: నిన్న కురిసిన భారీ వర్షాలకు అత్యధికంగా బాపట్ల జిల్లా చుండూరు మం.లో 27.24 సెం.మీ., గుంటూరు జిల్లా చేబ్రోలులో 23.4, దుగ్గిరాలలో 22.58, తాడికొండలో 22.50, మంగళగిరిలో 19.48, నాగాయలంకలో 19.1, పెదకాకానిలో 18.68, తుళ్లూరులో 18.02, తెనాలిలో 17.84, కోనసీమ జిల్లా డి.ముమ్మిడివరంలో 18.8, ఏలూరు జిల్లా నిడమర్రులో 14.3, NTR జిల్లా నందిగామలో 13.3, ప.గో.జిల్లా తాడేపల్లిగూడెంలో 11.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.