News August 14, 2025
పెబ్బేరు: బైక్ నుంచి రూ.2.20 లక్షలు చోరీ: SI

పార్కింగ్ చేసిన బైక్ టూల్ బాక్స్ నుంచి రూ.2.20లక్షలు చోరీ చేసిన ఘటన బుధవారం పెబ్బేరులో జరిగింది. శ్రీరంగాపూర్‌కు చెందిన ఆంజనేయులు పెబ్బేరు SBIలో డబ్బులు డ్రా చేసి బైక్ టూల్ బాక్స్‌లో ఉంచారు. బీజేపీ క్యాంపులో బైక పార్క్ చేసి అధికారిని కలిసి తిరిగి వచ్చేవరకు నగదును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు.
Similar News
News April 16, 2026
మీ మేనత్తలు ఎవరో నీకు తెలుసా?.. లోకేశ్‌కు YCP కౌంటర్

AP: వైఎస్ జగన్ తల్లిని, చెల్లిని తరిమేశారంటూ మంత్రి లోకేశ్ చేసిన <<19664163>>విమర్శలకు<<>> వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ‘మీ మేనత్తలు ఎవరో నీకు తెలుసా? ఏ రోజు అయినా ఇంటికి పిలిచి పట్టెడన్నం పెట్టావా? మీ బాబాయ్ రామ్మూర్తి నాయుడిని ఎందుకు గొలుసులతో కట్టేశారు? మీ నాన్నమ్మ చనిపోతే మీ నాన్న ఎందుకు తలకొరివి కూడా పెట్టలేదు? నువ్వు ఒకటి అంటే మేము పది అనగలం. ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు’ అని వార్నింగ్ ఇచ్చింది.
News April 16, 2026
SRHకు షాక్.. IPL నుంచి మరో బౌలర్ ఔట్

IPL: SRH బౌలర్ డేవిడ్ పేన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఆయన కాలి మడమ గాయంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. కాగా అంతకుముందు గాయంతో టోర్నీకి దూరమైన జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో <<19463818>>పేన్<<>> జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
News April 16, 2026
రేపు కేయూలో “ఆయితెర–2026” ప్రారంభం

కాకతీయ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల (కో-ఎడ్యుకేషన్) ఆధ్వర్యంలో మూడు రోజుల జాతీయ స్థాయి వార్షికోత్సవం “ఆయితెర–2026” ను ఏప్రిల్ 17 నుంచి 19 వరకు టెక్నికల్, కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్, ఫెస్ట్ అధ్యక్షుడు ఆచార్య ఎన్. రమణ తెలిపారు. ఈ ఫెస్ట్ ప్రారంభ కార్యక్రమం ఏప్రిల్ 17న ఉదయం 10:30 గంటలకు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహిస్తామన్నారు.


