News August 14, 2025
NZB: ఇష్టానుసారంగా తెస్తున్న అప్పు రాష్ట్రానికి ముప్పు: జీవన్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానమంటూ లేకుండా ఇష్టానుసారంగా తెస్తున్న అప్పు తెలంగాణ రాష్ట్రానికి ముప్పుగా పరిణమిస్తోందని BRS నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన NZBలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోందని మండిపడ్డారు.
Similar News
News August 15, 2025
NZB: దారుణం.. కన్న కూతురిపైనే అత్యాచారాయత్నం

నవీపేట్ మండలంలో దారుణం జరిగింది. ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కన్నకూతురి పైనే లైంగిక దాడికి యత్నించాడు. గ్రామస్థుల కథనం ప్రకారం.. మద్యానికి బానిసైన అతడు కొంతకాలంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో 11 ఏళ్ల కూతురికి ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూపుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని ఇటీవల తల్లి దృష్టికి తీసుకెళ్లగా బంధువులకు చెప్పి పంచాయతీ పెట్టారు. విషయం నిన్న పోలీసులకు చేరగా వారు దర్యాప్తు చేస్తున్నారు.
News August 15, 2025
WOW.. మువ్వన్నెల రంగుల్లో మెరిసిన SRSP

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు మూడు రంగుల్లో మెరిసిపోతోంది. ప్రాజెక్టును అధికారులు త్రివర్ణ పతాకం రంగుల్లో అలరారేలా చేయగా ప్రజలు దానిని చూసేందుకు బారులు తీరారు. చూసేందుకు కన్నుల పండువగా ఉండగా నిత్యం ఇలా లైటింగ్‌తో ఉంచితే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.
News August 15, 2025
‘ప్రభుత్వ ఆసుపత్రిలో పనితీరు మెరుగుపడాలి’

ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మరింతగా మెరుగుపడాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. వైద్య విధాన పరిషత్‌లో కొనసాగుతున్న జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ గురువారం సాయంత్రం జిల్లా కార్యాలయంలో సమీక్ష జరిపారు. బోధన్‌లోని జిల్లా ఆసుపత్రితో పాటు ఆర్మూర్, భీంగల్, ధర్పల్లి ఏరియా ఆసుపత్రులు, డిచ్పల్లి, వర్ని, మోర్తాడ్, కమ్మర్పల్లి, నవీపేట్ వైద్యులు వైద్య సేవలందించాలని సూచించారు.