News August 14, 2025

ట్రంప్ టారిఫ్స్‌కు బ్రెజిల్ కౌంటర్ ప్లాన్స్

image

బ్రెజిల్‌పై US అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% టారిఫ్స్‌కు ఆ దేశ అధ్యక్షుడు లూలా కౌంటరిచ్చేందుకు పావులు కదుపుతున్నారు. టారిఫ్స్‌తో ఎఫెక్ట్ అయిన దేశాధినేతలను ఒక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. జిన్‌పింగ్, మోదీలాంటి నేతల మద్దతు కోరుతున్నట్లు తెలిపారు. టారిఫ్స్‌తో నష్టపోతున్న వారి ఎగుమతిదారులకు 5.5 బి. డాలర్ల క్రెడిట్ లైఫ్‌లైన్, చిన్న పరిశ్రమలకు ట్యాక్స్ క్రెడిట్స్ ప్రకటించారు.

Similar News

News August 16, 2025

SSMB29 మూవీపై క్రేజీ అప్డేట్!

image

మహేశ్‌బాబు-రాజమౌళి కాంబోలో SSMB29 చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేశ్ బర్త్‌డో రోజు సెట్స్‌లో ప్రియాంకతో ఉన్న ఫొటో తాజాగా వైరలవుతోంది. ఇప్పుడు మరో అప్‌డేట్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే 3 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో నైరోబీ, టాంజానియాలో నాలుగో షెడ్యూల్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ప్యాన్ వరల్డ్ రేంజ్‌లో జక్కన్న ఈ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

News August 16, 2025

పెట్రోల్, డీజిల్ GST పరిధిలోకి రానట్లేనా?

image

GST <<17418489>>శ్లాబులను<<>> తగ్గిస్తామన్న కేంద్రం ప్రతిపాదనతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే పెట్రోలియం ఉత్పత్తులను GST పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం ఇష్టపడట్లేదని జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం పెట్రోల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సెస్ వసూలు చేస్తున్నాయి. అన్నీ కలిపి పన్నులు 50% వరకు ఉన్నాయి. ఒకవేళ GSTలోకి తెస్తే 28% శ్లాబులోకి రావొచ్చు.

News August 16, 2025

రష్యాకు యుద్ధం ఆపే ఉద్దేశం లేదు: జెలెన్‌స్కీ

image

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు యుద్ధం ఆపే ఉద్దేశం లేనట్లుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెనెన్‌స్కీ పేర్కొన్నారు. ‘యుద్ధం ఆపబోతున్నాం అని మాస్కో నుంచి ఎలాంటి ఆర్డర్ రాలేదు. ఎలాంటి సిగ్నల్ కూడా ఇవ్వలేదు. ట్రంప్‌తో భేటీ జరుగుతున్న రోజూ వాళ్లు మా ప్రజలను చంపుతూనే ఉన్నారు’ అంటూ జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. పుతిన్‌తో సీజ్ ఫైర్‌కు ట్రంప్ ఒప్పిస్తారా? ఇప్పుడు ప్రపంచ దేశాలన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఇదే.