News August 14, 2025

MDK: నవోదయలో ప్రవేశానికైై దరఖాస్తు పొడిగింపు

image

వర్గల్ కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశానికై దరఖాస్తు గడువును ఈనెల 27వ తేదీ వరకు పొడిగించినట్లు బుధవారం నవోదయ ప్రిన్సిపల్ దాసి రాజేందర్ తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఉమ్మడి జిల్లా వారై ఉండాలని, ప్రభుత్వ, ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలు నవోదయ వెబ్సైట్లో చూడాలని తెలిపారు.

Similar News

News April 18, 2026

అనకాపల్లి: ‘భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలి’

image

జలధార-నీటి భద్రత ద్వారా భూగర్భ జలాల నీటిమట్టం పెంపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. అనకాపల్లి కలెక్టరేట్‌లో శుక్రవారం ఎంపీడీవోలు, ఇరిగేషన్ అధికారులతో జలధార-నీటి భద్రతపై సమీక్షించారు. గ్రామాల్లో చెరువుల అభివృద్ధి పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించాలని సూచించారు. పంట కాలువల పూడికతీత, గేట్ల మరమ్మతు పనులు చేపట్టి సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరచాలన్నారు.

News April 18, 2026

‘అరైవ్ అలైవ్’ ప్రచారం కాదు.. ప్రాణాల రక్షణకు వాగ్దానం: సీపీ

image

‘అరైవ్ అలైవ్’ అనేది కేవలం ప్రచారం మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవాలనే బాధ్యత అని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. గజ్వేల్‌లో ఆమె మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడంతో ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం తప్పుతుందన్నారు.