News August 14, 2025
RED ALERT: అత్యంత భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కొనసాగుతున్నాయి. APలోని అల్లూరి, కోనసీమ, ఏలూరు, NTR, GNT, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. TGకి ఇవాళ కూడా RED ALERT జారీ చేసింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, KMM, SPT, యాదాద్రి, VKB, సంగారెడ్డి, MDK జిల్లాల్లో అత్యంత భారీ వానలు పడతాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది.
Similar News
News August 16, 2025
అలా చేస్తే ట్రంప్‌ని నోబెల్‌కి నామినేట్ చేస్తా: హిల్లరీ

ఒక షరతుపై US అధ్యక్షుడు ట్రంప్‌ని నోబెల్ బహుమతికి నామినేట్ చేస్తానని 2016లో ఆయనతో పోటీచేసి ఓడిన హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. ‘కీవ్ నుంచి ఉక్రెయిన్ కొంచెం కూడా భూభాగాన్ని కోల్పోకుండా, రష్యా-ఉక్రెయిన్ మధ్య ట్రంప్ యుద్ధాన్ని ఆపగలిగితే నేనే స్వయంగా ఆయన్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తాను’ అని హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించారు. మరి.. పుతిన్‌ని ట్రంప్ సీజ్‌ఫైర్‌కి ఒప్పిస్తారా? కామెంట్ చేయండి.
News August 16, 2025
TG వాహనాలకు ఇయర్లీ పాస్ ఎప్పుడంటే?

TG: నిన్నటి నుంచి దేశంలో ఫాస్టాగ్ <<17409246>>ఇయర్లీ పాస్<<>> అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ వాహనాలకు మాత్రం ఇంకా పాస్ అందుబాటులోకి రాలేదు. వాహన్ డేటా బేస్‌లో TG వాహనాల వివరాలను మెర్జ్ చేయకపోవడంతో సమస్య తలెత్తింది. కేంద్రం ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సురేంద్ర మోహన్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఆగస్టు 20కల్లా రాష్ట్రంలో ఇయర్లీ పాస్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
News August 16, 2025
SSMB29 మూవీపై క్రేజీ అప్డేట్!

మహేశ్‌బాబు-రాజమౌళి కాంబోలో SSMB29 చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేశ్ బర్త్‌డో రోజు సెట్స్‌లో ప్రియాంకతో ఉన్న ఫొటో తాజాగా వైరలవుతోంది. ఇప్పుడు మరో అప్‌డేట్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే 3 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో నైరోబీ, టాంజానియాలో నాలుగో షెడ్యూల్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ప్యాన్ వరల్డ్ రేంజ్‌లో జక్కన్న ఈ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.