News August 14, 2025

నేడు బలరామ జయంతి.. ఎలా పూజించాలంటే?

image

శ్రావణ బహుళ షష్ఠి(నేడు) రోజున బలరామ జయంతిని జరుపుకుంటారు. ఉ.8గం.-ఉ.11గం. వరకు పూజకు మంచిదని పండితులు తెలిపారు. ఈరోజు బలరాముని పూజిస్తే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం. ‘సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి బలరామకృష్ణుల పటాలకు గంధం, కుంకుమ పెట్టుకోవాలి. పారిజాత పూలు, శంఖు, పొగడ పూలతో పూజించాలి. పాలు, వెన్న, మీగడ, అటుకులు వంటి పదార్థాలతో నైవేద్యం సమర్పించాలి. ఉపవాసం ఉండాలి’ అని చెబుతున్నారు.

Similar News

News August 16, 2025

GET READY: 4.05 PMకి OG నుంచి అప్డేట్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ నుంచి మరో అప్డేట్ రానుంది. ఈ చిత్రంలోని ‘కన్మని’ సాంగ్‌ను ఈరోజు సాయత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రెడీగా ఉండాలంటూ ఫ్యాన్స్‌కు సూచించారు. ప్రియాంక మోహన్, పవన్ మధ్య ఈ సాంగ్ సాగుతుందని హింట్ ఇచ్చారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే.

News August 16, 2025

భారీ వర్షసూచన.. మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి: CM రేవంత్

image

TG: రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను CM రేవంత్ ఆదేశించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలకు SDRF, NDRF సిబ్బంది ముందుగానే వెళ్తే వారితో కలెక్టర్లు సమన్వయం చేసుకుంటారని చెప్పారు. లోత‌ట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించాలన్నారు. అంటువ్యాధులు ప్ర‌బ‌లే ఆస్కారం ఉన్నందున వైద్యారోగ్య‌శాఖ అప్రమత్తం కావాలని ఆదేశాలు జారీ చేశారు.

News August 16, 2025

సృష్టి ఫెర్టిలిటీ కేసు.. నేరం అంగీకరించిన డా.నమ్రత

image

TG: సృష్టి ఫెర్టిలిటీ కేసు నిందితురాలు డా.నమ్రత నేరం అంగీకరించినట్లు కన్ఫెషన్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ‘IVF, సరోగసీ ట్రీట్మెంట్ చేయకుండానే చాలామంది వద్ద రూ.30లక్షల చొప్పున వసూలు చేశాం. అబార్షన్‌‌కు వచ్చేవారికి డబ్బు ఆశ చూపి డెలివరీ తర్వాత శిశువులను కొనేవాళ్లం. పిల్లల కొనుగోలులో ఏజెంట్లు సంజయ్‌, సంతోషి కీలకంగా వ్యవహరించారు. నా కుమారుడు లీగల్‌గా సహకరించేవాడు’ అని ఆమె చెప్పినట్లు పేర్కొన్నారు.