News August 14, 2025
ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రాలేదా?

TG: బిల్లులు రాని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హౌసింగ్ కార్పొరేషన్ కీలక సూచన చేసింది. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు మ్యాచ్ కాకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. అలాంటివారు వెంటనే ఆధార్ కార్డులో తప్పులు ఉంటే సరిచేసుకోవాలని సూచించింది. ఇకపై ఆధార్ పేమెంట్ బ్రిడ్జి సిస్టం ద్వారానే చెల్లింపులు చేస్తామని తెలిపింది. కాగా లబ్ధిదారులు బిల్లుల స్టేటస్‌ను <
Similar News
News August 16, 2025
ఒక్క లైవ్ స్ట్రీమింగ్‌తో రూ.105 కోట్ల విరాళాలు

అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ వేలాది మందికి ఏదో విధంగా సాయం చేస్తుంటారు. తాజాగా ఛారిటీ కోసం ఆయన లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసి తన ఫాలోవర్లు సైతం ఎంతో కొంత సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి రికార్డు స్థాయిలో ఏకంగా $12,000,000 (రూ.105కోట్లు)కు పైగా విరాళాలు వచ్చినట్లు బీస్ట్ Xలో ప్రకటించారు. పేదలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఈ నిధులను వెచ్చించనున్నారు.
News August 16, 2025
ట్రంప్-పుతిన్ భేటీపై జెలెన్‌స్కీ ఫస్ట్ రియాక్షన్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ముగింపుపై ట్రంప్, పుతిన్ నిన్న రాత్రి అలస్కాలో <<17420790>>భేటీ<<>> అయిన విషయం తెలిసిందే. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. పుతిన్‌తో చర్చించిన విషయాలను ట్రంప్ ఫోన్ చేసి తనకు వివరించినట్లు చెప్పారు. తననూ చర్చలకు ఆహ్వానించినట్లు తెలిపారు. మరణాలు ఆపడం, యుద్ధం ముగించడంపై సోమవారం వాషింగ్టన్‌లో US అధ్యక్షుడితో ప్రత్యేకంగా సమావేశం అవుతానని వెల్లడించారు.
News August 16, 2025
కోర్టులకు ఆ అధికారం ఉండదు: కేంద్రం

బిల్లుల ఆమోదంపై గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు <<16410549>>విధించే<<>> అధికారం కోర్టులకు ఉండదని సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కొన్ని అంశాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే రాజ్యాంగపర గందరగోళం తలెత్తే అవకాశముందని ‘తాము గడువు విధించవచ్చా?’ అని SC ఇచ్చిన నోటీసులకు బదులిచ్చింది. గడువు విధించడం వల్ల వాళ్ల స్థానాన్ని తగ్గించినట్లు అవుతుందని, వారి విధుల్లో లోపాలుంటే చట్టపరంగానే సరిదిద్దాలని సూచించింది.