News August 14, 2025

EP35: ఎవరు చెప్పినా ఈ తప్పు చేయకండి: చాణక్య నీతి

image

మనిషి ఉన్నతంగా ఎలా బతకాలి? జీవితంలో ఎలా విజయం సాధించాలో చాణక్య నీతి వివరిస్తోంది. ‘అవకాశాలు పొందాలన్నా, సక్సెస్ కావాలన్నా ఎప్పుడూ మీలోని మంచి గుణాలను మార్చుకోకూడదు. ఎవరో చెప్పారని మిమ్మల్ని మీరు మార్చుకుంటూ పోతే ఆఖరికి మీ నిజమైన వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. కష్టాలను చూసి కుంగిపోకుండా మీపై మీరు నమ్మకం పెట్టుకుని ముందుకు సాగితే విజయం మిమ్మల్ని వరిస్తుంది’ అని చెబుతోంది.

Similar News

News August 16, 2025

ఒక్క లైవ్ స్ట్రీమింగ్‌తో రూ.105 కోట్ల విరాళాలు

image

అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ వేలాది మందికి ఏదో విధంగా సాయం చేస్తుంటారు. తాజాగా ఛారిటీ కోసం ఆయన లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసి తన ఫాలోవర్లు సైతం ఎంతో కొంత సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి రికార్డు స్థాయిలో ఏకంగా $12,000,000 (రూ.105కోట్లు)కు పైగా విరాళాలు వచ్చినట్లు బీస్ట్ Xలో ప్రకటించారు. పేదలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఈ నిధులను వెచ్చించనున్నారు.

News August 16, 2025

ట్రంప్-పుతిన్ భేటీపై జెలెన్‌స్కీ ఫస్ట్ రియాక్షన్

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ముగింపుపై ట్రంప్, పుతిన్ నిన్న రాత్రి అలస్కాలో <<17420790>>భేటీ<<>> అయిన విషయం తెలిసిందే. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. పుతిన్‌తో చర్చించిన విషయాలను ట్రంప్ ఫోన్ చేసి తనకు వివరించినట్లు చెప్పారు. తననూ చర్చలకు ఆహ్వానించినట్లు తెలిపారు. మరణాలు ఆపడం, యుద్ధం ముగించడంపై సోమవారం వాషింగ్టన్‌లో US అధ్యక్షుడితో ప్రత్యేకంగా సమావేశం అవుతానని వెల్లడించారు.

News August 16, 2025

కోర్టులకు ఆ అధికారం ఉండదు: కేంద్రం

image

బిల్లుల ఆమోదంపై గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు <<16410549>>విధించే<<>> అధికారం కోర్టులకు ఉండదని సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కొన్ని అంశాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే రాజ్యాంగపర గందరగోళం తలెత్తే అవకాశముందని ‘తాము గడువు విధించవచ్చా?’ అని SC ఇచ్చిన నోటీసులకు బదులిచ్చింది. గడువు విధించడం వల్ల వాళ్ల స్థానాన్ని తగ్గించినట్లు అవుతుందని, వారి విధుల్లో లోపాలుంటే చట్టపరంగానే సరిదిద్దాలని సూచించింది.