News April 1, 2024
గూడూరు: ఐదుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్?

బాలుర హైస్కూల్లో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని డీఈఓ రామారావు శనివారం తనిఖీ చేశారు. ఆ సమయంలో పరీక్షా కేంద్రంలోని ఓ గదిలో ఉపాధ్యాయురాలు సెల్ ఆపరేట్ చేస్తూ డీఈఓకు కనిపించారు. నిబంధనలకు విరుద్దంగా ముగ్గురు ఇన్విజిలేటర్లు, ఛీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు సెల్ ఫోన్స్ తీసుకురావడాన్ని గమనించి వారిని సస్సెండ్ చేసినట్లు సమాచారం.ఈ విషయాన్ని డీఈఓ కలెక్టర్‌కి తెలియజేశారు.
Similar News
News March 8, 2026
వరంగల్: పదో తరగతి పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు

వరంగల్ జిల్లాలో పరీక్షల నిర్వహణకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 47 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 48 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 47 మంది సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు, ఆరుగురు రూట్ అధికారులు, ఆరుగురు అదనపు రూట్ అధికారులు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 496 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల్లో 22 శాశ్వత, మిగిలిన 25 కేంద్రాల్లో తాత్కాలిక CC కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
News March 8, 2026
హుజూరాబాద్ సహాయ కార్మిక అధికారిణి D.చందన సస్పెన్షన్

హుజూరాబాద్ సహాయ కార్మిక అధికారిణి D.చందనను కార్మిక శాఖ కమీషనర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు సస్పెన్షన్ చేసినట్లు కార్మిక శాఖ వరంగల్ జోన్, సంయుక్త కార్మిక కమిషనర్ తెలిపారు. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల పెండింగ్, విధులకు గైర్హాజరు, అధికార దుర్వినియోగానికి పాల్పడటంపై KNR ఉప కార్మిక కమీషనర్ విచారణ ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
News March 7, 2026
WGL: నేటి నుంచి ‘హెచ్‌పీవీ’ టీకాలు

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత టీకా(HPV) పంపిణీ జిల్లాలో ఆదివారం నుంచి ప్రారంభమైంది. 15 ఏళ్లలోపు బాలికల కోసం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వర్ధన్నపేట, ఎంజీఎం, సీకేఎం ఆసుపత్రులలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డీఎంహెచ్‌వో సాంబశివరావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఈ టీకా కోసం 9,824 మంది బాలికలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.


