News August 14, 2025
తెనాలి: స్వాతంత్ర్యానికి చిహ్నం మన ‘స్వరాజ్ థియేటర్’

తెనాలికి స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రత్యేక చరిత్ర ఉంది. స్వాతంత్ర్యం ప్రకటించిన రోజే తెనాలిలో ఓ థియేటర్ ఓపెన్ చేశారని మీకు తెలుసా? అదే స్వరాజ్ టాకీస్. 1947 ఆగస్టు 15న ప్రారంభించారు. స్వాతంత్ర్యానికి చిహ్నంగా ఈ పేరు పెట్టారు. లండన్, జపాన్ నుంచి పరికరాలను దిగుమతి చేసుకుని ఆరోజుల్లోనే రూ.1.24 లక్షల వ్యయంతో దీనిని నిర్మించారు. ప్రస్తుతం ఇది మూతబడింది.
Similar News
News April 18, 2026
ప.గో: ధాన్యం కొనుగోళ్లు. వేధిస్తున్న గోనెసంచుల కొరత

ఉమ్మడి ప.గో జిల్లాలో 10.25 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంగా ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. ప.గోలో 255, ఏలూరులో 123 కేంద్రాల ద్వారా 53 వేల మెట్రిక్ టన్నులు సేకరించారు. కేంద్రాల్లో చిరిగిన గోనెసంచులు ఇస్తుండటం, ఎకరాకు 60 బస్తాల దిగుబడి వస్తుంటే 56 సంచులు మాత్రమే ఇస్తుండటంతో ధాన్యం అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు శ్రీనివాస్ కోరారు.
News April 18, 2026
ఫోన్లలో ‘ఆధార్’ యాప్ ప్రీఇన్‌స్టాలేషన్‌పై కేంద్రం యూటర్న్

స్మార్ట్ ఫోన్లలో ఆధార్ యాప్‌ను ప్రీ ఇన్‌స్టాల్ చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ ప్రతిపాదనపై యాపిల్, శామ్‌సంగ్ వంటి కంపెనీల నుంచి వ్యతిరేకత వచ్చినట్లు రాయిటర్స్ తెలిపింది. ఫోన్‌లలో ప్రభుత్వ యాప్‌లను ముందే ఇన్‌స్టాల్ చేయడం వల్ల డివైజ్‌ల భద్రతకు, యూజర్ల డేటా గోప్యతకు భంగం కలగవచ్చని కంపెనీలు అభిప్రాయపడినట్లు పేర్కొంది. ఫోన్ పనితీరుపైనా ప్రభావం పడొచ్చని చెప్పినట్లు సమాచారం.
News April 18, 2026
మోదీని ఇంతలా మోయాలా జగన్: షర్మిల

AP: బీజేపీతో <<19677732>>జగన్<<>> పెట్టుకున్న అక్రమ పొత్తు తేటతెల్లమైందని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ‘టీడీపీ, జనసేనల కంటే మోదీని ఇంతలా మోయాలా? అక్రమ డీలిమిటేషన్ బిల్లులపై NDA పక్షాన నిలబడ్డందుకు జగన్ సిగ్గుపడాలి. కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బతకాలా? జగన్ చేసిన ఈ నీచపు పనికి YSR ఆత్మ నిజంగా ఘోషిస్తోంది. ఏపీలో బీజేపీ అంటే చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్. ప్రతిపక్షం ఒక్క కాంగ్రెస్ మాత్రమే’ అని స్పష్టం చేశారు.


