News August 14, 2025
కరీంనగర్: మోడల్ స్కూల్ పీఈటీల సస్పెండ్: కలెక్టర్

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మోడల్ స్కూల్‌లో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన పీఈటీలు మోహన్, తిరుపతిలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్ట్ నిబంధనల మేరకు వారిని విధుల నుంచి తొలగించారు. ఈ విషయమై స్కూల్ ప్రిన్సిపాల్ సరిత, ఇంగ్లీష్ పీజీటీ కనక లక్ష్మిని సస్పెండ్ చేయాలని సిఫారసు చేశారు.
Similar News
News April 17, 2026
మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు: ఐజీ గోపీనాథ్ జట్టి

మాదకద్రవ్యాల నిర్మూలనపై విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి ఆధ్వర్యంలో ఐదు జిల్లాల ఎస్పీలతో శుక్రవారం సమీక్ష జరిగింది. “సంకల్పం, చైతన్యం, అభ్యుదయం 2.0” పేరుతో 100 రోజుల కార్యాచరణ చేపట్టారు. ఇప్పటివరకు రూ.11.63 కోట్ల ఆస్తులు ఫ్రీజ్ చేశమన్నారు. 72 కేసుల్లో 129 మందికి శిక్షలు పడినట్లు తెలిపారు. డ్రోన్లు, యాప్‌లతో నిఘా పెంచి, 1000 డ్రగ్ ఫ్రీ గ్రామాల లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
News April 17, 2026
HYDలో నయా ట్రెండ్ ఇదే!

HYDలో నైట్‌లైఫ్ ఇప్పుడు పక్కా క్యాలెండర్ ఈవెంట్‌లా మారిపోయింది. ఐటీ కుర్రాళ్లు, స్టూడెంట్స్ వారం ముందే గెస్ట్ లిస్టులు, టేబుల్స్ బుక్ చేసుకుంటున్నారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలిలో క్లబ్బింగ్ అంటే ఒక మినీ ఫెస్టివల్‌ను తలపిస్తోంది. సమయం తక్కువగా ఉండటంతో, రాత్రిపూట తిరగడం కంటే ముందే అన్నీ ప్లాన్ చేసుకోవడానికే యువత ప్రాధాన్యం ఇస్తోంది. పక్కా షెడ్యూల్‌తో ఎంజాయ్ చేయడం ఇప్పుడు ట్రెండ్.
News April 17, 2026
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు: కలెక్టర్

ఈనెల 25న జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు (పాలిసెట్) పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 15 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏలూరులో 9, నూజివీడులో 3, జంగారెడ్డిగూడెంలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.


