News August 14, 2025

సిద్దిపేట: రియల్ హీరో.. ప్రాణాలకు తెగించి విద్యుత్ పునరుద్ధరణ

image

సిద్దిపేటలోని నాగసముద్రం చెరువు మధ్యలో తెగిపోయిన లైన్‌ను పునరుద్ధరించేందుకు లైన్మెన్ హైముద్దీన్ సాహసం చేశాడు. తాడు సాయంతో చెరువు మధ్యలోకి వెళ్లి స్తంభం ఎక్కి కనెక్షన్ ఇచ్చి విద్యుత్‌ని పునరుద్ధరించారు. హైముద్దీన్ ధైర్య సాహసాన్ని మెచ్చి స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.

Similar News

News August 16, 2025

మెదక్ జిల్లాలో వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు: మంత్రి వివేక్

image

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెదక్ జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆనంతరం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి మాట్లాడారు.

News August 15, 2025

మెదక్ ఇంటర్ టాపర్‌కు పురస్కారం

image

మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ టాపర్ ఉప్పరి విక్రమ్‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి నగదు పురస్కారం అందజేశారు. చిన్నశంకరంపేట మోడల్ కళాశాలకు చెందిన విక్రమ్ ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించి పురస్కారాన్ని అందుకున్నాడు. పంద్రాగస్టు వేడుకల్లో కలెక్టర్ రాహుల్ రాజు, ఎమ్మెల్యే రోహిత్ రావు సమక్షంలో మంత్రి వివేక్ రూ.10 వేల నగదు, ప్రశంసా పత్రాన్ని బహూకరించారు. ప్రిన్సిపల్ వాణీ కుమారిని కలెక్టర్ అభినందించారు.

News August 15, 2025

మెదక్ డీపీఆర్ఓకు ఉత్తమ అవార్డు

image

మెదక్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి(డీపీఆర్ఓ) కే. రామచంద్ర రాజు జిల్లా ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా మెదక్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర కార్మిక, ఉపాధి, ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఏడాదికిపైగా మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ పౌర సంబంధాల శాఖ అధికారిగా ఉత్తమ సేవలు అందిస్తున్నారు.