News August 14, 2025
పంద్రాగస్టు నాడు మాంసం విక్రయాలు బంద్

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మాంసం విక్రయాలు నిషేధిస్తూ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా కబేళాలు, మాంసం దుకాణాలు, నాన్ వెజ్ హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే 1965 పురపాలక చట్టం ప్రకారం దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని బేతంచెర్ల కమిషనర్ హరి ప్రసాద్ హెచ్చరించారు.
Similar News
News August 16, 2025
సిరిసిల్ల జిల్లాలో వర్షపాతం ఇలా..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం ఉదయం 10 గంటల వరకు వర్షపాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. రుద్రంగిలో 12.8 మి.మీలు, చందుర్తి 10.8, బోయినపల్లి 9.3, వేములవాడ 7.8, ఇల్లంతకుంట 7.0, వీర్నపల్లి 6.0, కొనరావుపేట 6.0, సిరిసిల్ల 4.3, ముస్తాబాద్ 3.0, ఎల్లారెడ్డిపేట 2.8, గంభీరావుపేట 2.5, వేములవాడ రూరల్‌లో 0.8 మి.మీల వర్షపాతం నమోదయింది.
News August 16, 2025
సంగారెడ్డి: అత్యవసరం అయితే 100కు ఫోన్ చేయాలి: ఎస్పీ

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున అత్యవసరం అయితే 100, 87126 56739 నంబర్లకు ఫోన్ చేయాలని ఎస్పీ పారితోష్ పంకజ్ శనివారం తెలిపారు. ప్రజలు చెరువులు, కుంటల వైపు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకోవాలని పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఉండొద్దని తెలిపారు.
News August 16, 2025
గొల్లప్రోలు: బాదం ఆకుపై శ్రీకృష్ణుని చిత్రం

గొల్లప్రోలు మండలం చెందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు పిల్లి గోవిందరాజులు తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఆయన బాదం ఆకుపై శ్రీకృష్ణుని చిత్రాన్ని లీఫ్ కార్వింగ్ ద్వారా చెక్కారు. ఈ కళ ద్వారా విద్యార్థులకు కృష్ణాష్టమి విశిష్టతను వివరించారు.