News April 1, 2024

SRD: ‘ఎన్నికల్లో అక్రమాలపై పౌరులు ఫిర్యాదు చేయాలి’

image

ఎన్నికల్లో అక్రమాలపై పౌరులు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి చూసించారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన సి-విజిల్ యాప్‌ను అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం, మతపరమైన ప్రసంగాలు తదితరాలపై సి-విజిల్ యాప్ ద్వారా జిల్లా యంత్రాంగానికి తెలపాలన్నారు. ఫిర్యాదుకు ఫొటోలు, వీడియోలు జత చేయాలని, 100 నిమిషాల్లో చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

Similar News

News March 23, 2026

మెదక్: 2.60 లక్షల మంది రైతులకు రైతు భరోసా..!

image

మెదక్ జిల్లాలో మొదటి విడత రైతుభరోసా డబ్బులు అన్నదాతల బ్యాంకు అకౌంట్లలో జమ అవుతున్నాయి. 2,60,818 మంది రైతులు ఉండగా మొదటి విడతలో ఎకరం వరకు అందరు రైతులకు రూ.110,44,83,698 జమ అవుతున్నట్లు జిల్లా అధికారి దేవకుమార్ తెలిపారు. రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నట్లు తెలియడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రైతుభరోసా నగదు విడుదల చేసిన విషయం తెలిసిందే.

News March 23, 2026

చిన్నశంకరంపేట: హత్యకు గురైన యువకుడి గుర్తింపు

image

చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో దారుణ హత్యకు గురైన యువకుడు స్థానిక స్టీల్ పరిశ్రమలో పని చేసే జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన దేవ హెమ్రాన్‌గా పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ జాగిలాలతో రంగంలోకి దిగిన పోలీసులు హత్యకు గల కారణాలు అన్వేషిస్తున్నారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ వెంకట రాజం గౌడ్, ఎస్ఐ నారాయణ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.