News August 14, 2025

NLG: 18 నుంచి రెండో విడత లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ

image

జిల్లాలో రెండో విడత లైసెన్స్ సర్వేయర్ల శిక్షణను ఈ నెల 18 నుంచి నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ (రెవెన్యూ), జిల్లా సర్వే అధికారి జి.సుజాత తెలిపారు. శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో పాటు ఒక జిరాక్స్ సెట్, ప్రభుత్వ సివిల్ సర్జన్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. నల్లగొండ కలెక్టరేట్ ప్రాంగణంలోని ఉదయాదిత్య భవన్‌కు ఉదయం 11 గంటలకు చేరుకోవాలన్నారు.

Similar News

News April 18, 2026

నల్గొండ: సర్పంచ్ కుమారుడి ‘పెత్తనం’పై కంప్లైంట్

image

సర్పంచ్ కుమారుడి వేధింపులు తాళలేకపోతున్నానంటూ చందంపేట మండలం గుంటిపల్లి పంచాయతీ కార్మికుడు నల్ల దేవరాజు శుక్రవారం కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ కొడుకు అనధికారికంగా పెత్తనం చలాయిస్తూ, తాను విధులకు హాజరవుతున్నా గైర్హాజరు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల గత ఆరు నెలలుగా జీతం రాకుండా అడ్డుపడుతున్నారని, వెంటనే విచారణ జరిపి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కార్మికుడు వేడుకున్నారు.

News April 18, 2026

NLG: పాలిసెట్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్) రాసే విద్యార్థులకు నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ కేవీ.నరసింహారావు తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి మే 11 వరకు తరగతులు జరుగుతాయన్నారు. మే 13న జరగనున్న పాలిసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని చెప్పారు. విద్యార్థులు ఈనెల 18, 19వ తేదీల్లో కళాశాలలో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

News April 18, 2026

అడవిదేవులపల్లిలో అత్యధికంగా ఉష్ణోగ్రత

image

జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటగా, అడవిదేవులపల్లిలో అత్యధికంగా 43 డిగ్రీలు నమోదైంది. ఈనెల 13 నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. మే నెల చివరి వరకు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.