News August 14, 2025

జనగామ జిల్లాలో మత్తడి పోస్తున్న చెరువులు, కుంటలు

image

భారీ వర్షాలతో జనగామ జిల్లాలో చెరువులు, కుంటలు మత్తడి పోస్తున్నాయి. జిల్లాలో 779 చెరువులు ఉండగా 96 చెరువులు పూర్తి స్థాయిలో మత్తడి పోస్తున్నాయి. మరో 126 చెరువుల్లో 80 శాతానికి నీరు వచ్చి చేరింది. జనగామ నియోజకవర్గంలోని పలు రిజర్వాయర్లలో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. వీటి పరిధిలో లక్ష ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News April 17, 2026

TU: పాలకమండలి సభ్యుడిని అభినందించిన TUTA

image

తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలిలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ప్రొఫెసర్ ఆంజనేయులును ప్రభుత్వం నియమించింది. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (TUTA) ఆయన్ను శుక్రవారం అభినందించింది. ప్రొఫెసర్ ఆంజనేయులు మాట్లాడుతూ.. యూనివర్సిటీ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన వర్సిటీ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరిలకు కృతజ్ఞతలు తెలిపారు.

News April 17, 2026

మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్ర ఇదే

image

మహిళా రిజర్వేషన్ ప్రస్తావన రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలోనే (1946-49) వచ్చినా అది సాధ్యపడలేదు. 1996లో దేవెగౌడ ప్రభుత్వం 33% రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టగా గందరగోళం నెలకొంది. 1998-2003 మధ్య నాలుగుసార్లు సేమ్ సీన్ రిపీటైంది. 2010లో మళ్లీ UPA ప్రభుత్వం మొదట రాజ్యసభలో ఆమోదించినా ఆ తర్వాత జాప్యం వల్ల అమలులోకి రాలేదు. 2023లో ఈ బిల్లుకు ఆమోదం లభించగా దీనికి సవరణలు చేపట్టి కేంద్రం మరోసారి తీసుకొచ్చింది.

News April 17, 2026

NTR జిల్లాలో పంచాయతీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే!

image

పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. NTR జిల్లాలో మొత్తం 8,35,515 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పురుషులు 4,06,803 మంది ఉండగా, మహిళలు 4,28,680 మంది ఉన్నట్లు చెప్పారు. ఇతరులు 32 మంది ఉన్నారని, ఇప్పటికే జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ మొదలైంది. జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.