News August 14, 2025

మెదక్: ‘టీచర్ల నిబద్ధతతో పాఠశాలల్లో నూతన ఉత్సాహం’

image

FRS విధానం అమలుతో సమయపాలనలో క్రమశిక్షణ మరింత బలపడిందని డీఈవో రాధాకిషన్ తెలిపారు. టీచర్లు సమయానికి హాజరై, పాఠశాల సమయం ముగిసే వరకు నిబద్ధతతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. FRS యాప్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలను 3, 4 రోజుల్లో పూర్తిస్థాయిలో పరిష్కరించనున్నట్టు DEO వెల్లడించారు. ఈ విధానం ద్వారా పాఠశాలల్లో పనితీరు, విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని తెలిపారు.

Similar News

News October 27, 2025

స్వగ్రామానికి చేరిన తల్లి, కూతురు మృతదేహాలు

image

కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన మంగ సంధ్యారాణి (43), ఆమె కుమార్తె చందన (23) మృతదేహాలు స్వగ్రామం మెదక్ మండలం శివాయిపల్లికి చేరాయి. డీఎన్ఏ పరీక్షల అనంతరం నిన్న సాయంత్రం కుటుంబీకులకు అప్పగించారు. భర్త ఆనంద్‌ గౌడ్ మృతదేహాలను తీసుకొచ్చారు. మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి.

News October 27, 2025

పాపన్నపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

పాపన్నపేట మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన యువకుడు తరుణ్ రెడ్డి (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆదివారం రాత్రి తరుణ్ రెడ్డి సంగారెడ్డి నుంచి జోగిపేట వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఫసల్వాది వద్ద జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తరుణ్ రెడ్డి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

News October 26, 2025

‘TET నుంచి మినహాయింపు ఇవ్వాలి’

image

సీనియర్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మెదక్ కేవల్ కిషన్ భవన్‌లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న 5 డిఏలను వెంటనే ప్రకటించాలని, పిఆర్సి 2023 జూలై నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పద్మారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు