News August 14, 2025

సంగారెడ్డి: ఆదర్శ పాఠశాలల్లో స్పాట్ అడ్మిషన్లు

image

సంగారెడ్డి జిల్లాలోని 10 ఆదర్శ పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు నేరుగా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు సంప్రదించి చేరాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News April 20, 2026

పరమాత్ముడు ఒక్కటే.. మతాలన్నీ ప్రజల కల్పనలే!

image

మర్మమెరుగ లేక మతములు కల్పించి
యుర్విజనులు దుఃఖ మొందుచుంద్రు
గాజుటింటి కుక్క కళవళపడురీతి
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: పరమాత్ముడి అసలు రహస్యం తెలియక మూఢ జనాలు విభిన్న మతాలను కల్పించారు. ఒకరినొకరు ద్వేషించుకుంటూ బాధపడుతూ కాలం గడుపుతున్నారు. అద్దాల గదిలో ఉన్న కుక్క తన ప్రతిబింబాన్ని చూస్తే కలవరపడి మొరుగుతుందో అలా చేస్తున్నారు.
<<-se>>#PADHYAM<<>>

News April 20, 2026

డిగ్రీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫ్రీ హాస్టల్, కోచింగ్

image

TG: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ BC గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2026-27 అకడమిక్ ఇయర్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 కాలేజీల్లో BSc, BCom, BBA లాంటి రెగ్యులర్ కోర్సులతో పాటు యానిమేషన్ వంటి స్పెషల్ కోర్సుల్లో 9,260 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు మే 10వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఉచిత వసతితోపాటు క్వాలిటీ ఎడ్యుకేషన్, పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తారు.

News April 20, 2026

సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ పరీక్షలు.. 7757 విద్యార్థులు

image

జిల్లాలో ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ 10 ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి తెలిపారు. పదో తరగతికి 10 పరీక్ష కేంద్రాల్లో 2,692, ఇంటర్మీడియట్‌కు 18 కేంద్రాల్లో 5,065, మొత్తం 7,757 మంచి విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.