News August 14, 2025

గోల్కొండలో పంద్రాగస్టు వేడుకలు.. ఈ రూట్‌లో రాకపోకలు బంద్

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో వేడుకలు జరగనున్నాయి. పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట వరకు వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు.
SHARE IT

Similar News

News August 16, 2025

హైదరాబాద్: ఫ్యాన్సీ నంబర్.. పెరిగిన సర్కారు వారి పాట

image

ఫ్యాన్సీ నంబర్ ప్రియులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఫ్యాన్సీ నంబర్ల ప్రాథమిక ధరను దాదాపు మూడు రెట్లు పెంచింది. ఆ నంబర్ నచ్చిన వారు వేలంలో పాడుకొని దక్కించకోవచ్చు. ఇలా దాదాపు రూ.100 కోట్ల వరకు ఆదాయం వచ్చేలా రవాణాశాఖ అధికారులు ప్లాన్ చేశారు. ఫ్యాన్సీ నంబర్ల ధరలను పెంచుతూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

News August 16, 2025

ట్రాఫిక్‌ నియంత్రణ.. సిటీలో ప్లాన్-బీ

image

నగరంలో రోజు రోజుకూ ట్రాఫిక్ పెరిగిపోతోంది. ముఖ్యంగా ప్రధాన ఐటీ సంస్థలు, ఆస్పత్రుల వద్ద ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. అందుకే ఆయా సంస్థల వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ మార్షల్స్‌ను ఏర్పాటు చేయాలని సీపీ నిర్ణయించారు. అయితే, వారి జీతం మాత్రం ఆయా కంపెనీలే భరిస్తాయి. శిక్షణ మాత్రం పోలీసులు ఇచ్చి ట్రాఫిక్‌ను నియంత్రిస్తారు. 100 మంది మార్షల్స్ ను ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఉపయోగించుకుంటారు.

News August 16, 2025

HYD: గణపతికి గుమి‘గూడు’!

image

వినాయకచవితికి మరో 10 రోజులే గడువు ఉండడంతో HYDలోని వీధుల్లో సందడి మొదలైంది. గల్లీ గణేశుడికి గూడు కడుతున్నారు. నాటు కర్రలు, తడకలు, బొంగు కర్రల షాపులకు క్యూ కట్టారు. కర్రపూజ చేసి మండపం నిర్మిస్తున్నారు. విగ్రహాన్ని తీసుకొచ్చిన తర్వాత పందిరి వేస్తామని కొందరు ఆర్గనైజర్లు చెబుతున్నారు. మార్కెట్‌లో 18 ఫీట్ల కర్ర ఒక్కోటి రూ.180 నుంచి రూ.250 మధ్య అమ్ముతున్నారు. మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.