News August 14, 2025
వరంగల్ జిల్లాలో నేటి వర్షపాతం వివరాలు ఇలా..!

వరంగల్ జిల్లాలో గత రెండు రోజులుగా వాతావరణం చల్లబడింది. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి నగరంతో పాటు ఆయా గ్రామాల్లో సైతం చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నేడు 33.7 మి.మీ. వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లాలోని 13 మండలాల్లో మోస్తారుగానే వర్షపాతం ఉందని తెలిపింది. మరో రెండు రోజులపాటు కూడా వర్షసూచన ఉన్నట్లుగా అధికారులు స్పష్టం చేశారు.
Similar News
News February 20, 2026
నెక్కొండలో ఇద్దరు ఉపాధ్యయులు సస్పెండ్

వరంగల్ జిల్లా నెక్కొండ మండల పరిధిలో పని చేస్తున్న ఇద్దరు ఎస్జీటీ ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ డీఈవో రంగయ్య శుక్రవారం ఉత్తర్వులు జరీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరవుతున్న అంకం ప్రవీణ్ కుమార్, రామారపు రవి సస్పెండ్ అయ్యారు. ప్రవీణ్ కుమార్ అజ్మీర మంగ్యా తండా MPPS, రవి గొట్లకొండ MPPSలలో ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్నారు.
News February 19, 2026
మిర్చి నాణ్యతపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

మార్కెట్‌లో మిర్చికి మంచి ధరలు ఉన్నప్పటికీ, రైతులు నాణ్యతపై దృష్టి పెట్టకపోతే నష్టపోయే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హెచ్చరించారు. ఎనుమాముల మార్కెట్ యార్డులో మిర్చి సీజన్ పరిస్థితులపై ఆమె సమీక్ష నిర్వహించారు. తేమతో కూడిన మిర్చిని తీసుకురావడం వల్ల రంగు మారి నాణ్యత దెబ్బతింటోందని, ఫలితంగా విదేశీ వ్యాపారులు కొనుగోలుకు విముఖత చూపుతున్నారని పేర్కొన్నారు.
News February 19, 2026
10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచాలి: కలెక్టర్

జిల్లాలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పెంచుటకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంఈవోలు, హెడ్ మాస్టర్లతో డీఈఓ రంగయ్య నాయుడుతో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9,492 మంది ఉన్నారని, ఫలితాల మెరుగుదలకు పాఠశాల స్థాయిలో ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని హెడ్ మాస్టర్లను ఆదేశించారు.


