News August 14, 2025

ఏలూరు: PETల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ పాఠశాలల్లో 2 సంవత్సరాల కాలపరిమితికి వ్యాయామ ఉపాధ్యాయుల(SA (PD)PET)నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జులై 31 నాటికి పది సంవత్సరాల సర్వీస్ పూర్తై ఉండాలన్నారు. కంప్యూటర్ పై పూర్తి అనుభవం ఉండాలన్నారు. ఈ నెల 20వ తేదీ లోపు దరఖాస్తులను జిల్లా విద్యశాఖ కార్యాలయంలో అందించాలని చెప్పారు.

Similar News

News April 19, 2026

గ్రేటర్ జోన్‌లో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్

image

గ్రేటర్ జోన్‌లో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. గత రెండు రోజులుగా అత్యధికంగా 99 నుంచి 100 మిలియన్ యూనిట్లు నమోదవుతోంది. సాధారణంగా వేసవి తీవ్రత పెరిగే మే నెలలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుంది. ఈ సారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడం వల్ల మార్చి ప్రారంభంలోనే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది.

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ 20% నీటిని ఆదా చేయాలి

image

వేసవి దృష్ట్యా వచ్చే 45 రోజులు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ 20 శాతం నీటిని ఆదా చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కోరారు. నగరంలో నీటి సరఫరాపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్లతో పోలిస్తే ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగిందని, సరఫరా 52 వేల నుంచి లక్షా 8 వేలకు చేరిందన్నారు. కేవలం 20 శాతం ప్రాంతాల్లోనే అధిక డిమాండ్ ఉందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.