News August 14, 2025
పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్‌ఆర్ ప్యాకేజీ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఆర్&ఆర్, భూ సేకరణపై అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్షించారు. ఏలూరు జిల్లాలో 5 వేలు ఎకరాలు భూమి అవసరం కాగా ఇప్పటికే బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో 1400 ఎకరాలను గుర్తించామన్నారు. భూ సేకరణ పనులు ఈ నెల 15 కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు.
Similar News
News August 16, 2025
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ‘కిన్నెరసాని’

ఆళ్లపల్లి మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శనివారం ఉదయం రాయిపాడు గ్రామ సమీపంలో వంతెన వద్ద కిన్నెరసాని వాగు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జిల్లా కేంద్రానికి వెళ్లే వాహనదారులు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు లో లెవెల్ బ్రిడ్జి దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఇకనైనా ప్రభుత్వం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
News August 16, 2025
రేపు NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు?

NDA తరఫు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై నేతలు కసరత్తు మొదలుపెట్టారు. రేపు ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు సమాచారం. అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు NDA పక్షాలు అప్పగించాయి. ఈ నెల 21తో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో అభ్యర్థి ఎంపికను రేపే ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.
News August 16, 2025
ఖమ్మం: ఆ ప్రాంత ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

చింతకాని మండలం నాగులవంచ ప్రాంత ప్రజలకు రైల్వే శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. నాగులవంచ రైల్వే స్టేషన్ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రైల్వే స్టేషన్ మూసివేతను నిరసిస్తూ ప్రాంత ప్రజలు నిరసనలు వ్యక్తం చేయడంతో పునరాలోచన చేసి నిర్ణయం తీసుకున్నారు. రైల్వే స్టేషన్‌ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రైల్వే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.