News August 14, 2025

కరీంనగర్‌: నేటితో PACSల కాల పరిమితి ఖతం!

image

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల గడువు నేటితో ముగియనుంది. ఉమ్మడి కరీంనగర్‌లోని 131 PACSలకు 2020 ఫిబ్రవరి 13న ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత సహకార సొసైటీల పాలకవర్గాల సభ్యులను ఎన్నుకున్నారు. వారి 5 ఏళ్ల గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 13న ముగియగా.. ప్రభుత్వం 6 నెలల పదవీకాలం పొడిగించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం PACS 123 ఉండగా కరీంనగర్లో 30, జగిత్యాల 51, సిరిసిల్ల 22, పెద్దపల్లిలో 20 ఉన్నాయి.

Similar News

News August 16, 2025

ADB: రాబోయే 3 గంటల్లో మోస్తరు వర్షాలు

image

ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వచ్చే మూడు గంటల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం సూచించింది. ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు ఉంటాయని సూచిస్తూ ప్రజలకు వ్యక్తిగత సందేశాలను పంపుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News August 16, 2025

భూపాలపల్లి జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

image

భూపాలపల్లి జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు కింది విధంగా ఉన్నాయి. మహదేవపూర్ 36.2, పలిమెల 91.6, మహాముత్తారం 105.8, కాటారం 36.2, మల్హర్ రావు 55.6, చిట్యాల 27.4, టేకుమట్ల 29.2 మొగుళ్లపల్లి 29.0, రేగొండ 52, ఘన్‌పూర్ 62.4, భూపాలపల్లి 97.2 కాగా.. జిల్లా మొత్తం 622.6 మి.మీ, జిల్లా యావరేజీ 56.6 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు వివరించారు.

News August 16, 2025

కురుపాం: ఆంగార కాయలకు భలే గిరాకీ..!

image

కురుపాం ఏజెన్సీ ప్రాంతంలోని ముఠా గ్రామాల్లో వర్షాకాలంలో పండే ఆంగార కాయలకు మంచి గిరాకీ ఉంది. ఏడాదికి ఒక సారి పండే అంగార కాయలు నాణ్యత, పరిమాణం బట్టి కిలో ధర రూ.160 నుంచి 210 పలుకుతోందని గిరిజనలు తెలిపారు. ఆంగాక కాయల కూరలతో కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయని గిరిజనుల నమ్మకం. వీటిని దళారులు కొండపై గ్రామాలకు వెళ్లి అక్కడ తక్కువ ధరకు కొని మైదాన ప్రాంతంలో అధిక ధరలకు అమ్ముతున్నారని వారు వాపోయారు.