News August 14, 2025
పులివెందుల ఎన్నిక: కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు

ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా కడపలో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ అశోక్ కుమార్ సారథ్యంలో దాదాపు 500 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల వరకు బయటి వ్యక్తులను అనుమతించడం లేదు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Similar News
News August 15, 2025
కడపలో జెండా ఎగురవేసిన మంత్రి ఫరూక్

స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు కడప నగరంలో నిర్వహించారు. పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి మంత్రి ఫరూక్ హాజరై జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై తన సందేశంలో ప్రజలకు వినిపించారు.

జెండా ఎగురవేసిన కడప కలెక్టర్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కడప జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ శ్రీధర్ జాతీయ జెండాను ఎగరవేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం జాతీయ జెండా ఎగురవేసి అధికారులకు సిబ్బందికి ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగ ఫలితంతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు.