News August 14, 2025

ADB: భారీ వర్షాలు.. ఈ నంబర్లు సేవ్ చేస్కోండి

image

ఉమ్మడి ఆదిలాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాకేంద్రాల్లోని కలెక్టరేట్‌లలో సహాయకేంద్రాలు ఏర్పాటుచేశారు. వరద ముంపు, అత్యవసర పరిస్థితుల్లో ఆ నంబర్లకు కాల్ చేసి సహాయం పొందవచ్చు. జిల్లాల వారీగా నంబర్లు ఇలా ఉన్నాయి.
ఆదిలాబాద్ – 18004251939
నిర్మల్ – 9100577132
మంచిర్యాల – 08736-250501
ఆసిఫాబాద్ – 8500844365
SHARE IT

Similar News

News August 16, 2025

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎంపీ సతీష్

image

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా కాకినాడ ఎంపీ సానా సతీష్ ఎంపికయ్యారు. శనివారం విజయ వాడలో ఆయన ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుంచి ధ్రువీకరణ పత్రంను స్వీక రించారు. క్రికెటర్‌గా తన జీవితాన్ని ప్రారంభించి వ్యాపార, వాణిజ్య వ్యాప్తంగా ఎదిగి రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు చేపట్టిన సతీష్ రెండోసారి అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నిక కావడం పట్ల కాకినాడ ప్రముఖులు ఆయనను అభినందించారు.

News August 16, 2025

అమ్మాయిలకు ఫ్రీగా స్కూటీలు.. కేంద్రం ఏమందంటే?

image

కేంద్ర ప్రభుత్వం దేశంలోని మహిళలు, యువతులకు ఉచితంగా స్కూటీలను అందిస్తుందని, అప్లై చేసుకోండని జరుగుతున్న ప్రచారాన్ని ‘PIBFactCheck’ ఖండించింది. కేంద్రం ఇలాంటి ‘ఫ్రీ స్కూటీ స్కీమ్’ను తీసుకురాలేదని స్పష్టం చేసింది. ఇలాంటి విషయాలను ఎవరైనా షేర్ చేస్తే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్స్‌లో చెక్ చేసి నిర్ధారించుకోవాలని సూచించింది. ఇతరులకు మీరు షేర్ చేసే ముందు నిజాన్ని తెలుసుకోవాలని కోరింది.

News August 16, 2025

ఏలూరు: గౌతు లచ్చన్నకు నివాళులర్పించిన కలెక్టర్

image

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జీవితం అందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్‌లో శనివారం ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలు ‘సర్దార్’ బిరుదు ఇచ్చారని కలెక్టర్ తెలిపారు.