News August 14, 2025
ధర్మారం: నంది పంప్ హౌస్‌లో ఎత్తిపోతలు షురూ

ధర్మారం మండలంలోని నంది పంప్ హౌస్‌లో గోదావరి జలాల ఎత్తిపోతల ప్రక్రియ ప్రారంభమైంది. కాళేశ్వరం నుంచి ఒక్కో మోటార్ ద్వారా 3,150 క్యూసెక్కుల నీరు నంది రిజర్వాయర్‌లోకి తరలివెళ్తోంది. అక్కడి బాహుబలి మోటార్లలో 3 మోటార్లు నడిపి నంది రిజర్వాయర్‌కు 9,450 క్యూసెక్కుల నీటిని తరలించారు. కాగా ఇక్కడి జలాలను రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్ హౌస్‌కు జలాలు తరలివెళ్తున్నాయి.
Similar News
News April 16, 2026
ఆ విమానాల్లో స్లీపర్ సీట్లు!

బస్సులు, రైళ్లలో ఉన్న స్లీపర్ బెడ్లు ఇకపై ‘ఎయిర్ న్యూజిలాండ్’ విమాన సర్వీసుల్లో కన్పించనున్నాయి. 17గంటల పాటు సాగే ప్రయాణాల్లో స్కైనెస్ట్ పాడ్స్ పేరుతో ఈ సదుపాయం కల్పించనున్నారు. వచ్చే నవంబర్ నుంచి న్యూయార్క్-ఆక్లాండ్ సర్వీసుల్లో ఇవి అందుబాటులోకి వస్తాయి. ఇందులో ఒకేసారి ఆరుగురు నిద్రపోయే అవకాశం ఉంటుంది. 4 గంటల తర్వాత మిగతా ప్రయాణికులు ఉపయోగించుకుంటారు. ఇందుకోసం ముందుగానే ఈ సర్వీసును ఎంచుకోవాలి.
News April 16, 2026
పచ్చిపాలు.. చర్మానికి చేసేను మేలు

☛ పచ్చి పాలు, తేనె కలిపి ఆ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కాటన్ బాల్స్‌తో శుభ్రం చేసుకోవాలి. కొద్ది సేపటికి చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది.
☛ పచ్చి పాలలో అరటి పండును కలిపితే అది చర్మానికి మరింత మేలు చేస్తుంది. దీని కోసం కొద్దిగా పచ్చిపాలు, సగం అరటి పండు వేసి మెత్తగా కలపాలి. ఆ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి 20నిమిషాల తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది.
News April 16, 2026
పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టే 3 బిల్లులు ఇవే..

1. కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు-2026: ఢిల్లీ, J&K, పుదుచ్చేరిలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన. ఇందులోనే మహిళా రిజర్వేషన్ల అమలు.
2. రాజ్యాంగ(131వ) సవరణ బిల్లు: LS, అసెంబ్లీ స్థానాల్లో 33% మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు. MP స్థానాలను 850కి పెంచడం.
3. డీలిమిటేషన్ బిల్లు-2026: కొత్తగా పెరిగే సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించేందుకు కమిషన్ ఏర్పాటు.


