News August 14, 2025
NZB: ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న కలెక్టర్

నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ప్రతి రోజూ ఆకస్మిక తనిఖీలతో హడలేత్తిస్తున్నారు. ఏదో ఒక మండలాన్ని, ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడి కార్యాలయాలను తనిఖీ చేస్తున్నారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలను గోప్యంగా ఉంచడంతో డుమ్మాలు కొట్టే ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఏ క్షణంలో కలెక్టర్ ఏ కార్యాలయానికి తనిఖీలకు వస్తారో తెలియక ఉద్యోగులు సమయ పాలన పాటిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.
Similar News
News April 18, 2026
NZB: జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు

నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని రెండేళ్ల కాల పరిమితికి ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఛైర్మన్‌గా ఉన్న కమిటీలో సభ్యులుగా జి.సాయి ప్రసాద్, బాల కుమార్, నర్సింహులు, భూపతి, రామదయానంద్, మహ్మద్ గౌస్, శ్రీనివాస్, శ్రీకాంత్, మాజిద్, జాన్సన్‌లను నియమించారు.
News April 17, 2026
TU: వార్షికోత్సవ పనులను వేగవంతం చేయాలి: వీసీ

ఈనెల 22న నిర్వహించనున్న యూనివర్సిటీ వార్షికోత్సవం పనులను వేగవంతం చేయాలని టీయూ వీసీ ప్రొ.టి. యాదగిరి రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం వార్షికోత్సవ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కమిటీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు. ఇంజినీరింగ్, ఆర్ట్స్ కళాశాలల ప్రిన్సిపల్ ఆరతి, రాంబాబు పాల్గొన్నారు.
News April 17, 2026
LSSSDCతో తెలంగాణ యూనివర్సిటీ MoU

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు చెందిన Life sciences sector skill development council, తెలంగాణ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం (MoU) చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణులైన M.Sc, B.Sc, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ విద్యార్థులకు వివిధ సెక్టార్ కంపెనీల కోసం ఈ సంస్థ ముఖాముఖి నిర్వహించనుంది. రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి పాల్గొన్నారు.


