News August 14, 2025
పులివెందుల ZPTC ఫలితాలు: ఎవరికి ఎన్ని ఓట్లు.!

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పూర్తి అయింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి 6 వేల పై చిలుకు ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై విజయం సాధించారు. 11 మంది బరిలో ఉన్నారు.
లతా రెడ్డి: 6716, హేమంత్ రెడ్డి: 683
శివ కళ్యాణ్ రెడ్డి: 101, సురేశ్ రెడ్డి: 4
అనిల్ రెడ్డి: 1, శివా రెడ్డి: 0
రవీంద్రా రెడ్డి: 14, గాజేంద్రనాథ్ రెడ్డి: 79
మారెడ్డి భరత్ రెడ్డి: 35, వెంగల్ రెడ్డి: 3
సునీల్ యాదవ్: 2.
Similar News
News April 15, 2026
రష్యా To ఇండియా.. ఆయిల్ దిగుమతులు 3 రెట్లు!

రష్యా నుంచి ఇండియాకు భారీగా క్రూడాయిల్ వస్తోంది. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో దిగుమతులు 3 రెట్లు పెరిగి 5.3 మిలియన్ యూరో(రూ.58 వేల కోట్లు)లకు చేరాయి. వాల్యూమ్ రెట్టింపు కావడం, ధరలు పెరగడం వల్ల ఇంపోర్ట్ వ్యయం పెరిగింది. ఫిబ్రవరిలో 1.8 బిలియన్ యూరోలుగా ఉన్న ఫాసిల్ ఫ్యూయల్(చమురు, బొగ్గు వంటివి) ఇంపోర్ట్స్ మార్చిలో 5.8 బిలియన్ యూరోలకు చేరాయి. ఇందులో 91%(€5.3M) క్రూడాయిల్ ఉత్పత్తులే కావడం గమనార్హం.
News April 15, 2026
NZB: రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌లో జిల్లాకు 9 మెడల్స్

రాష్ట్ర స్థాయి అండర్ -17 రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో నిజామాబాద్ రెజ్లర్లు 9 మెడల్స్ సాధించారు. హైదరాబాదులో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో టి.వెంకటేష్ గోల్డ్ మెడల్, బి.రోజా సిల్వర్ మెడల్, జి.గణేష్ సిల్వర్ మెడల్ సాధించగా ప్రవీణ్, మహేందర్, సృజన, రాజేశ్వరి, గంగాధర్, అంబాదాస్ బ్రాంజ్ మెడల్ సాధించినట్లు కోచ్ కం మేనేజర్‌గా వ్యవహరించిన దేవేందర్, బిందు తెలిపారు.
News April 15, 2026
రామాయణ తర్వాత సెట్స్‌పైకి ‘బ్రహ్మాస్త్ర 2’!

రణ్‌బీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీ సీక్వెల్‌పై నిర్మాత నమిత్ మల్హోత్రా అప్డేట్ ఇచ్చారు. రామాయణ సినిమా పూర్తయ్యాక బ్రహ్మాస్త్ర 2 పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ స్క్రిప్ట్ రెడీ చేశారని సమాచారం. సీక్వెల్ పనులు జరుగుతున్నాయని రణ్‌బీర్ గతంలో చెప్పారు. ప్రస్తుతం గ్లోబల్‌గా రామాయణ ప్రమోషన్స్‌లో మేకర్స్ బిజీగా ఉన్నారు.


