News August 14, 2025
TU: ఇంజినీరింగ్ కళాశాలలో 61 మంది విద్యార్థుల రిపోర్ట్

తెలంగాణ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కళాశాలకు 81 మంది విద్యార్థులను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఎప్‌సెట్ ద్వారా కేటాయించారు. సీఎస్‌ఈలో 65 మందికి గాను 61, CSE(AI)లో 9 మందికి ఏడుగురు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముగ్గురు, డాటా సైన్స్‌లో ముగ్గురు విద్యార్థులు రిపోర్ట్ చేసి అడ్మిషన్లు తీసుకున్నారని ప్రిన్సిపల్ ఆచార్య ఆరతి తెలిపారు. విద్యార్థులకు వసతి సౌకర్యం లేదని స్పష్టం చేశారు.
Similar News
News April 18, 2026
వర్షాకాల సమావేశాల్లో మళ్లీ మహిళా బిల్లు?

మహిళా రిజర్వేషన్ల బిల్లును మరోసారి లోక్‌సభ ముందుకు కేంద్రం తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జులైలో జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. దాంతోపాటే డీలిమిటేషన్ బిల్లునూ సభ ముందు ఉంచాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయే కేంద్ర క్యాబినెట్ మీటింగ్‌లో ఏం నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
News April 18, 2026
కోచ్ వేధిస్తున్నాడు: నీరజ్ చోప్రా

కోచ్ నావల్‌సింగ్ మానసికంగా వేధిస్తున్నాడని.. తమను, కుటుంబీకులను బూతులు తిడుతున్నాడని ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, పారాలింపిక్ ఛాంపియన్ సుమిత్ అంటిల్ సహా మరికొందరు అథ్లెట్లు ‘సాయ్’కి ఫిర్యాదు చేశారు. మద్యం సేవించి దూషిస్తున్నాడని, పోటీలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన ప్రవర్తన దారుణంగా ఉంటోందని సుమిత్ వాపోయారు. ఇలాంటి వ్యక్తులతో క్రీడావ్యవస్థకే చెడ్డపేరని, తక్షణమే చర్యలు తీసుకోవాలని నీరజ్ కోరారు.
News April 18, 2026
జ్ఞానులకు, అహంకారులకు మధ్య తేడా ఇదే!

నిండు నదులు పారు నిల్చి గంభీరమై
వెర్రివాగు పారు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: గొప్ప నదులు గంభీరంగా, నిశ్శబ్దంగా ప్రవహిస్తాయి. కానీ చిన్న వాగులు మాత్రం ఎగిరెగిరి పడుతూ, శబ్దం చేస్తూ వేగంగా ప్రవహిస్తాయి. ఇదేవిధంగా జ్ఞానులు శాంతంగా, నిదానంగా ఉంటారు. అల్పులు మాత్రం తొందరపాటుతో అహంకారంగా మాట్లాడుతారు.
<<-se>>#PADHYAM<<>>


