News August 14, 2025
మెదక్: 20 అడుగులకు చేరిన పోచారం ప్రాజెక్ట్

మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో గల పోచారం ప్రాజెక్టు నీటిమట్టం గురువారం 20 అడుగుల నీటి మట్టానికి చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, లింగంపేట, గాంధారి నుంచి వస్తున్న వాగులు పారడంతో ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. ఓవర్ ఫ్లో కావడానికి మరో అర అడుగు దూరంలో ఉంది. 20.5 అడుగుల నీరు వస్తే ప్రాజెక్టు ఓవర్ ఫ్లో కానుంది. దిగువ పంటలకు కాలువ ద్వారా నీరు వదిలారు.
Similar News
News August 16, 2025
మెదక్: రైతులకు డీఏవో దేవ్ కుమార్ సూచనలు

భారీ వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ సూచించారు. పంట పొలాల్లో నీరు నిలిచి ఉంటే కాలువల ద్వారా బయటకు పంపాలని సూచించారు. నాట్లు వేయని రైతులు వర్షాలు తగ్గిన తర్వాత నాట్లు వేసుకోవడానికి సిద్ధం కావాలని కోరారు. సమయం తక్కువగా ఉంటే వెదజల్లే పద్ధతిలో విత్తనాలు వేసుకోవచ్చని సూచించారు. అలాగే, కలుపు నివారణ చర్యలు తీసుకోవాలని రైతులకు తెలిపారు.
News August 16, 2025
MDK: ఏడుపాయల వరదను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

ఏడుపాయల పరిసర ప్రాంతాలను మెదక్ జాయింట్ కలెక్టర్ నగేశ్ సందర్శించి వరద పరిస్థితిని పర్యవేక్షించారు. సింగూర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జాయింట్ కలెక్టర్ నగేశ్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News August 16, 2025
MDK: డైట్‌లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు: ప్రిన్సిపల్

ప్రభుత్వ, ప్రైవేట్ డీఈడీ కళాశాలలలో భర్తీ కాకుండా మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు మెదక్ ప్రభుత్వ డైట్ ప్రిన్సిపల్ ప్రొ.డి.రాధాకిషన్ తెలిపారు. ఈనెల 19, 20 తేదీల్లో అడ్మిషన్ పొందాలన్నారు. డీసెట్-2025లో క్వాలిఫై అయిన అభ్యర్థులు డీఎల్ఈడీ, డీపీఎస్ఈ కోర్సులలో మార్గదర్శకాల ప్రకారం సంబంధిత కేటగిరిలో ఖాళీలను బట్టి ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు.