News August 14, 2025

పులివెందులలో డిపాజిట్ కోల్పోయిన వైసీపీ

image

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం వైసీపీని తీవ్ర నిశారపరిచింది. 30 ఏళ్ల తర్వాత ఎన్నిక జరగ్గా ఆ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ఈ ఎన్నికలో 7794 ఓట్లు పోలయ్యాయి. డిపాజిట్ దక్కాలంటే 16 శాతం ఓట్లు (1248) సాధించాల్సి ఉంది. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు పడ్డాయి. అయితే ఈ ఎన్నికలో రిగ్గింగ్, దొంగ ఓట్లు భారీగా పడ్డాయని వైసీపీ ముందు నుంచి ఆరోపిస్తోంది.

Similar News

News April 18, 2026

విజయవాడలో నేడే మ్యూజికల్ నైట్.. సమయమిదే!

image

విజయవాడలో ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పర్యాటక ప్రాధికార సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సుమారు 6 వేల మంది హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

News April 18, 2026

మొగల్తూరు: వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యాయత్నం

image

మొగల్తూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతిని గుబ్బల మావుళ్లు గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న ఆమెను నిత్యం వెంబడిస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి, ఈనెల 14న తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీనిపై మొగల్తూరు ఎస్సై జి.వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

News April 18, 2026

కాళ్ల బేరానికొచ్చిన ట్రంప్?

image

ఇరాన్‌ను నాశనం చేసి హార్ముజ్‌ను స్వాధీనం చేసుకుంటామని ఇన్నాళ్లూ పెద్దపెద్ద ప్రకటనలు చేసిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశంపై ప్రేమను ఒలకబోస్తున్నారు. హార్ముజ్‌ను ఓపెన్ చేశామని ప్రకటించడంతో ఏకంగా థాంక్స్ చెప్పారు. ఇరాన్ అందమైన దేశమంటూ కీర్తించారు. యుద్ధంలో గెలవడం చేతగాకే ట్రంప్ ఇలా మాట్లాడుతున్నారని పలువురు నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఇరాన్ యురేనియం ఇచ్చేస్తుందన్న ట్రంప్ <<19679151>>ప్రకటనా<<>> ఉత్తదే అని తేలింది.