News August 14, 2025
మెదక్: అండర్-15 జిల్లా స్థాయి ఎంపికలు

జిల్లా స్థాయి వాలీబాల్ బాల, బాలికల (అండర్-15) ఎంపికలు మెదక్ గుల్షన్ క్లబ్లో గురువారం నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 8 మంది బాలురు, 8 మంది బాలికలతో కూడిన జట్టును ఎంపిక చేశారు. నిర్వాహకులు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మేడి మధుసూదన్ రావు, రిటైర్డ్ పీడీ డైరెక్టర్ ప్రభు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు, నరేశ్, మాధవరెడ్డి, వినోద్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News August 15, 2025
మెదక్: ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు సస్పెండ్

మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకట్రావు నగర్ కాలనీలో బుధవారం పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఎస్పీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేసిన దాడిలో బాగంగా పట్టుబడ్డ కానిస్టేబుల్స్ అంజనేయులు, సురేశ్‌పై శాఖపరమైన చర్యలో భాగంగా సస్పెండ్ చేస్తు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీసులు క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News August 15, 2025
మెదక్: వాలీబాల్ బాలబాలికల జట్ల ఎంపిక

అంతర్జాతీయ పాఠశాలల వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మెదక్ జిల్లా జట్టు ఎంపిక చేశారు. క్రీడా సమాఖ్య మెదక్ జిల్లా(SGF) కార్యదర్శి ఆర్. నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించగా 110 మంది బాలికలు, 150 మంది బాలురు పాల్గొన్నారు. ఇందులో 8 మంది బాలురు, 8 మంది బాలికలతో జిల్లా జట్టును ఎంపిక చేశారు. క్లబ్ బాధ్యులు మధుసూదన్ రావు, డా. కొక్కొండ ప్రభు, పీడీలు మాధవరెడ్డి, శ్రీధర్ ఉన్నారు.
News August 15, 2025
MDK: ‘అత్యవసర సేవలకు అందుబాటులో ఉండాలి’

అత్యవసర సేవలు అందించేందుకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం పెద్దశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రికార్డులు, ల్యాబ్, ఫార్మసీలను తనిఖీ చేసి, లేబర్ రూంను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వర్షాల కారణంగా గర్భిణులను ఈడీడీకి పది రోజుల ముందు సమీప ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు.