News August 14, 2025

ASF ఎమ్మెల్యేకు సుప్రీంకోర్టులో ఊరట

image

ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీకి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. ఎమ్మెల్యే కోవ లక్ష్మీ ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అబద్ధాలు ఎక్కువ రోజులు నిలబడవని.. ఇది మరోసారి రుజువైందని ఎమ్మెల్యే లక్ష్మి పేర్కొన్నారు. తమపై ఊరికే నిందలు వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Similar News

News April 18, 2026

పవన్ కళ్యాణ్‌కు సర్జరీ

image

AP: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఇవాళ సర్జరీ జరిగింది. నిన్న ఓ సమావేశంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడం, కొన్ని నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుండటంతో ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, పూర్తిగా హెల్తీగా మారేందుకు ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు.

News April 18, 2026

టి-హబ్ సేవల మెరుగుదలకు కలెక్టర్ ప్రత్యేక దృష్టి

image

కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యక్షతన టి-హబ్ సేవలపై సమీక్ష జరిగింది. నాణ్యమైన పరీక్షలు, ఖచ్చితమైన ఫలితాల కోసం పర్యవేక్షణ పెంచాలని ఆయన ఆదేశించారు. నమూనాల తిరస్కరణపై నివేదిక కోరారు. నిత్యం 1500 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌‌వో డాక్టర్ వెంకట రమణ, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.

News April 18, 2026

పెద్దలు కుదిర్చే పెళ్లికి సిద్ధమైన శ్రుతి హాసన్‌?

image

హీరోయిన్ శ్రుతి హాసన్ పెద్దలు కుదిర్చే పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. వరుడిని వెతికే పనిలో తండ్రి కమల్ బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని సంబంధాలను చూసినా వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. వీలైనంత త్వరగా మ్యారేజ్ చేయాలని ఆయన భావిస్తున్నారట. కాగా గతంలో లండన్ బేస్డ్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలే, విజువల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ఆమెకు బ్రేకప్ జరిగిన విషయం తెలిసిందే.