News August 14, 2025

భద్రాచల ఆలయానికి ISO గుర్తింపు

image

భద్రాచలం దేవస్థానానికి ISO గుర్తింపు లభించింది. దీనిని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతులు మీదుగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవికి సర్టిఫికెట్‌ను ISO డైరెక్టర్ శివయ్య అందించారు. కాగా, ISO అనేది ఉత్పత్తి నాణ్యత, భద్రత, సామర్థ్యాన్ని ధ్రువీకరించే ఒక గుర్తింపు సంస్థ అని తెలిపారు.

Similar News

News April 18, 2026

నేర నియంత్రణే లక్ష్యం: జిల్లా ఎస్పీ

image

పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఎస్పీ సతీశ్ కుమార్ శనివారం జిల్లాస్థాయి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసులు విజిబుల్ పోలీసింగ్ పెంచాలని, రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. సమాజానికి హాని కలిగించే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని స్పష్టం చేశారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను అభినందించారు.

News April 18, 2026

హైదరాబాద్.. అడుగడుగునా ‘షాందార్’

image

శిలలపై చెక్కిన కావ్యంలా హైదరాబాద్ అడుగడుగునా ‘షాందార్’ అనిపిస్తుంది. చార్మినార్ దర్పం, గోల్కొండ కోట శబ్ద విన్యాసాలు, కుతుబ్ షాహీ సమాధుల కళా వైభవం నగరానికి మణిహారాలు. నిజాంల విలాసానికి ప్రతీక చౌమహల్లా ప్యాలెస్. బన్సీలాల్‌పేట్ మెట్ల బావి కూడా గొప్ప వారసత్వం, సంస్కృతికి సాక్ష్యాలు. ఈ చారిత్రక సంపదను కాపాడుకోవడం మన బాధ్యత. గోల్కొండ, చార్మినార్ గోడలపై పిచ్చి రాతలు వద్దు. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం.

News April 18, 2026

హైదరాబాద్.. అడుగడుగునా ‘షాందార్’

image

శిలలపై చెక్కిన కావ్యంలా HYD అడుగడుగునా ‘షాందార్’ అనిపిస్తుంది. చార్మినార్ దర్పం, గోల్కొండ కోట శబ్ద విన్యాసాలు, కుతుబ్ షాహీ సమాధుల కళా వైభవం నగరానికి మణిహారాలు. నిజాంల విలాసానికి ప్రతీక చౌమహల్లా ప్యాలెస్. బన్సీలాల్‌పేట్‌ మెట్ల బావి, సాలార్జంగ్ మ్యూజియం గొప్ప వారసత్వం, సంస్కృతికి సాక్ష్యాలు. ఈ చారిత్రక సంపదను కాపాడుకోవడం మన బాధ్యత. చరిత్ర గుర్తులపై పిచ్చి రాతలు వద్దు. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం.