News August 14, 2025

HYD: ప్రాణాలు పోతేనే స్పందిస్తారా..?

image

సికింద్రాబాద్ కార్ఖానా ట్రాఫిక్ PS పక్కనే మెయిన్‌ రోడ్డుపై భారీ గుంత ప్రమాదకరంగా మారింది. ఈ గుంత ఏర్పడి ఏడాది దాటిందని, ఇప్పటి వరకు అధికారులు మరమ్మతులు చేయలేదని, ప్రాణాలు పోతేనే స్పందిస్తారా అంటూ వాహనదారులు మండిపడుతున్నారు. బుధవారం రాత్రి ఓ కారు వేగంగా వచ్చి గుంతను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో వెనకాల వచ్చిన బైక్ నడిపే వ్యక్తి కారును ఢీకొట్టి గాయపడ్డాడు. మీ ప్రాంతంలో ఇలాంటి గుంతలు ఉంటే కామెంట్ చేయండి.

Similar News

News April 17, 2026

నెల్లూరులో రేపటి IAB వాయిదా

image

నెల్లూరు జడ్పీ ఆఫీసులో శనివారం జరగాల్సిన ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డ్(IAB) మీటింగ్ వాయిదా పడింది. ఈ మేరకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటన విడుదల చేశారు. అనివార్య కారణాలతో సమావేశం వాయిదా వేసినట్లు తెలిపారు. తదుపరి సమావేశం తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు.

News April 17, 2026

హార్ముజ్ ఓపెన్.. చమురు ధరలు క్రాష్

image

హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో చమురు ధరలు భారీగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఐరోపాకు చెందిన బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్ ధర 10.13 డాలర్లు తగ్గి $89.26కు చేరింది. మరోవైపు USకు చెందిన WTI క్రూడ్ $10.45 తగ్గి $84.24కు, UAEకి చెందిన ముర్బాన్ క్రూడ్ 8 డాలర్లు తగ్గి $93.46కు చేరాయి. యుద్ధంతో ఓ దశలో $150కి చేరుతుందనుకున్న చమురు ధర ఇప్పుడు ఈ స్థాయిలో తగ్గడం ఊరటనిస్తోంది.

News April 17, 2026

VZM: ‘మంజూరైన పరిశ్రమలను వేగంగా ముందుకు తీసుకెళ్లాలి’

image

రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహ బోర్డు ద్వారా జిల్లాకు మంజూరైన పరిశ్రమలను వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తన చాంబర్‌లో రెవెన్యూ, పరిశ్రమల శాఖ అధికారులతో విజయనగరం జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాకు 4 పరిశ్రమలు మంజూరయ్యాయని, వీటికి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా వచ్చాయన్నారు. ఆటంకాలు లేకుండా పనులను ప్రారంభించాలన్నారు.